- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కశ్మీర్ నుంచి ఢిల్లీ చేరుకున్న NIA డీజీ.. కాసేపట్లో ఉగ్రదాడిపై హోంశాఖకు నివేదిక
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని పెహల్గాం ఉగ్రదాడి(Terrorist Attack)పై ఎన్‌ఐఏ(National Investigation Agency) అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని పెహల్గాం ఉగ్రదాడి(Terrorist Attack)పై ఎన్‌ఐఏ(National Investigation Agency) అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. బైసరన్ లోయ(Baisaran Valley)లో జీఐఎస్ సాంకేతికతతో 3డీ మ్యాపింగ్ చేస్తున్నారు. ఉగ్రవాద ఓవర్‌గ్రౌండ్ వర్కర్లతో పాటు అనుమానాస్పద దుకాణాదారులను కూడా NIA అధికారులు విచారిస్తున్నారు. కాసేపట్లో కేంద్ర హోంశాఖకు NIA డీజీ ప్రాథమిక నివేదిక సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన కశ్మీర్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు.
మరోవైపు.. ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎస్ఐఏ) గుర్తించింది. వీరిలో చాలామందిని ఇప్పటికే అరెస్టు చేశారు. మిగిలినవారు నిఘా నీడలో ఉన్నారు. విచారణలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 3 వేల మందిని ప్రశ్నించినట్లు తెలిపారు. వీరిలో 186 మంది ఇప్పటికీ దర్యాప్తు బృందాల కస్టడీలో ఉన్నారు. దాడికి సంబంధించి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసేందుకు ఎస్ఐఏ అత్యాధునిక విధానాలు వినియోగిస్తోంది. శాటిలైట్ ఇమేజ్లు, డ్రోన్ దృశ్యాలు, బాధితులు, గుర్రపు స్వారీ ఆపరేటర్ల నుంచి సమాచారం సేకరిస్తోంది.






