దేశవ్యాప్తంగా NIA సోదాలు!

by Ajay Maddhiboyina |

దేశ‌వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో, 15 ప్రాంతాల్లో ఎన్ఐఏ నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఎజెన్సీ ఏక‌కాలంలో సోదాలు నిర్వ‌హిస్తోంది. ఢిల్లీ, హ‌ర్యానా, ప‌శ్చిమ బెంగాల్, మ‌హారాష్ట్ర‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, రాజ‌స్థాన్

దేశవ్యాప్తంగా NIA సోదాలు!
X

దిశ, వెబ్ డెస్క్: దేశ‌వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో, 15 ప్రాంతాల్లో ఎన్ఐఏ (నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఎజెన్సీ) ఏక‌కాలంలో సోదాలు నిర్వ‌హిస్తోంది. ఢిల్లీ, హ‌ర్యానా, ప‌శ్చిమ బెంగాల్, మ‌హారాష్ట్ర‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, రాజ‌స్థాన్, అస్సాం రాష్ట్రాల్లో సోదాలు నిర్వ‌హిస్తోంది. ఎన్ఐఏకు చెందిన ప‌లు బృంధాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ మోతీరామ్ జాట్ పాకిస్థాన్‌కు గూఢచారిగా వ్యవహరిస్తూ కీలక సమాచారాన్ని దాయాది దేశానికి చేరవేసినందుకు అతడిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడిని అధికారులు విచారిస్తున్నారు. విచారణలో మోతీరామ్ డబ్బులు తీసుకుని కీలక సమాచారాన్ని పాకిస్థాన్ ఏజెంట్లకు చేరవేసినట్టు అధికారులు గుర్తించారు. మరోవైపు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కూడా కస్టడీలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఎన్ఐఏ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.

Next Story