- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NHAI: తగ్గనున్న టోల్ టాక్స్ భారం.. త్వరలోనే కొత్త యాప్ ప్రవేశపెట్టనున్న ఎన్‌హెచ్ఏఐ
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కొత్త యాప్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏ దారిలో వెళ్తే టోల్ తక్కువగా ఉంటుందనే దానిపై డ్రైవర్లకు సమాచారం అందించడానికి తన రాజ్యమార్గ్ యాత్ర యాప్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఇది త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎన్‌హెచ్ఏఐ అధికారిక యాప్‌లో టోల్ టాక్స్ ఇండికేటర్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది వినియోగదారులు రెండు నగరాల మధ్య అతి తక్కువ టోల్ టాక్స్ ఉన్న మార్గాన్ని ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రయాణీకులకు ఉత్తమ ఎంపికను ఎంచుకోవడంలో సహాయపడటానికి ఈ యాప్ తీసుకొస్తున్నట్టు ఎన్‌హెచ్ఏఐ ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ అమృత్ సింఘా తెలిపారు. రెండు నగరాల మధ్య ఉన్న అత్యల్ప టోల్ మార్గాన్ని యాప్ గుర్తింస్తుందని పేర్కొన్నారు. హైవే ట్రావెల్ యాప్ ప్రయాణికులకు జాతీయ రహదారులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుందని, అంతేగాక ఫిర్యాదులను పరిష్కరించేందుకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. కాగా, 2023లో ప్రారంభమైన రాజ్యమార్గ్ యాత్ర యాప్ జాతీయ రహదారులపై లభ్యమయ్యే సౌకర్యాల గురించి వినియోగదారులకు సమాచారం అందిస్తుంది. ఈ క్రమంలోనే దానిని అప్ డేట్ చేసి టోల్ వివరాలను వాహనదారులకు తెలియజేయనుంది.






