- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వం vs పిల్లులు
ఆ దేశంలో పిల్లుల సమస్య ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.

దిశ, వెబ్ డెస్క్ : ఆ దేశంలో పిల్లుల సమస్య ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో తాడో పేడో తేల్చుకుందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. అందులో భాగంగా న్యూజిలాండ్ దేశంలోని అడవి పిల్లులను 2050 నాటికి పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ఓ పెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ వివరాల ప్రకారం.. ఇవి పెంపుడు పిల్లులు కాదని, అడవుల్లో తిరిగి స్థానిక పక్షులు, బల్లులు, గబ్బిలాలు వంటి అంతరించే దశలో ఉన్న జీవులను పెద్ద సంఖ్యలో చంపుతున్నాయి కాబట్టి ఈ అడవి పిల్లులను “స్టోన్ కోల్డ్ కిల్లర్స్” అని కూడా పిలుస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో సుమారు 25 లక్షల అడవి పిల్లులు ఉన్నట్లు అంచనా వేస్తూ.. వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్య రక్షణ కోసం న్యూజిలాండ్ ఇప్పటికే ఫెర్రెట్స్, స్టోట్స్, వీసెల్స్ వంటి ప్రమాదకర వేటాడే జంతువులను నిర్మూలన జాబితాలో చేర్చగా, ఇప్పుడా లిస్టులో అడవి పిల్లులను కూడా చేర్చింది. ఈ కార్యక్రమంలో పెంపుడు పిల్లులకు ఎటువంటి హాని జరగకుండా చూసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.






