దేశరాజధానిలో దారుణం.. భర్త హత్యకు ప్లాన్.. నిద్రమాత్రలతో చావలేదని..!

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-19 08:47:52  IST  )

అక్రమ సంబంధాలు, ఇష్టంలేని పెళ్లిళ్లు, అనుమానాలు, అత్తింటి వేధింపులు, స్వేచ్ఛకు అడ్డుగా ఉన్నారని భావించడం.. ఇలా కారణం ఏదైనా కానీ దాంపత్య జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోవడమే కాకుండా.. జీవిత భాగస్వామిని చంపేస్తున్నారు.

దేశరాజధానిలో దారుణం.. భర్త హత్యకు ప్లాన్.. నిద్రమాత్రలతో చావలేదని..!
X

దిశ, వెబ్‌డెస్క్: అక్రమ సంబంధాలు, ఇష్టంలేని పెళ్లిళ్లు, అనుమానాలు, అత్తింటి వేధింపులు, స్వేచ్ఛకు అడ్డుగా ఉన్నారని భావించడం.. ఇలా కారణం ఏదైనా కానీ దాంపత్య జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోవడమే కాకుండా.. జీవిత భాగస్వామిని చంపేస్తున్నారు. మేఘాలయలో హనీమూన్ కు వెళ్లిన రఘువంశీ హత్య తర్వాత దేశవ్యాప్తంగా అనేకమంది భర్తలు, భార్యల హత్యలు వెలుగుచూశాయి. అంతకుముందు మేరఠ్ లో భార్య రస్తోగి తన ప్రియుడు సాహిల్ తో కలిసి సౌరభ్ ను చంపి 15 ముక్కలుగా కోసి డ్రమ్ లో సీల్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తాజాగా ఢిల్లీలోనూ ఓ భార్య.. తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. తొలుత నిద్రమాత్రలు ఇవ్వగా.. చావకపోవడంతో కరెంట్ షాక్ పెట్టి మరీ చంపేసింది.

ఈ దారుణ ఘటనపై జాతీయ మీడియాలో వెల్లడైన వివరాలు ఇలా ఉన్నాయి. సుస్మిత అనే మహిళ ఈనెల 13న తన భర్త కరణ్ దేవ్ (36)కు కరెంట్ షాక్ తగిలిందంటూ ఒక ఆస్పత్రికి తీసుకెళ్లింది. వెంటనే పరిశీలించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్థారించారు. సుస్మిత చెప్పిన దానిప్రకారం కరణ్ నిజంగానే కరెంట్ షాక్ తో చనిపోయాడని కుటుంబమంతా నమ్మి పోస్టుమార్టం వద్దని చెప్పారు. కానీ ఢిల్లీ పోలీసులు మాత్రం అతని వయసు, మరణించిన తీరు చూసి పోస్టుమార్టం చేయాల్సిందేనని తెలిపారు. అందుకు సుస్మిత, కరణ్ కజిన్ రాహుల్ ససేమిరా కుదరదన్నారు. వారి మాటలు పట్టించుకోని పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

మూడ్రోజుల తర్వాత కరణ్ తమ్ముడైన కునాల్ కు వదిన సుస్మిత, రాహుల్ పై అనుమానం వచ్చింది. ఇన్ స్టాగ్రామ్ లో ఇద్దరి మధ్య జరిగిన చాటింగే ఇందుకు కారణం. వెంటనే కునాల్ ఆ వివరాలను పోలీసుల ముందుంచాడు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న సంబంధం బయటపడింది. రాత్రి తినే భోజనంలో 15 నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. ఆ తర్వాత ఇంటర్నెట్ లో మోతాదుకు మించి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటే ఏం జరుగుతుందో, ఎంత సేపటికి చనిపోతారో సెర్చ్ చేశారు. అయినా కూడా కరణ్ కు ఊపిరి అందుతుండటంతో కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారు. వారిద్దరి మధ్య జరిగిన చాటింగ్ ఆధారంగా పోలీసులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించగా.. సుస్మిత తానే హత్యచేసినట్లు అంగీకరించింది. డబ్బు కోసం తనను వేధించడంతోనే మనోవేదనకు గురై ఇలా చేసినట్లు తెలిపింది.

Next Story