ఓటర్ల లిస్టులో మాజీ ఉపముఖ్యమంత్రి పేరు మాయం..

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-02 09:38:51  IST  )

ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా ఓటర్ల లిస్టులో తనపేరు మాయమైందని ఆరోపించారు.

ఓటర్ల లిస్టులో మాజీ ఉపముఖ్యమంత్రి పేరు మాయం..
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Elections) జరగనుండగా.. అందుకు సంబంధించిన ఓటర్ల లిస్టును ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. అయితే ఈ లిస్టులు కొందరు నాయకుల పేర్లు మిస్సవ్వడంతో విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా ఓటర్ల లిస్టులో తనపేరు మాయమైందని ఆరోపించారు.

పట్నాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తన ఈపీఐసీ నంబరుతో ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో చెక్ చేయగా.. బిహార్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో (Bihar Draft Voter List) తన పేరు కనిపించలేదని వాపోయారు. బూత్ లెవల్ అధికారే స్వయంగా తన వద్దకు వచ్చి ఫామ్ ను తీసుకెళ్లారని, ఓటరు లిస్టులోనే పేరు లేకపోతే ఇక ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలని ప్రశ్నించారు. ఓటర్ల జాబితా సవరణ అనంతరం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 20-30 వేల ఓటర్లను తొలగించారని, రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల ఓటర్లను తొలగించారని తేజస్వీ యాదవ్ ఆరోపించారు.

కాగా.. ఓటర్ లిస్టులో తనపేరు కనిపించకపోవడంపై తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో ఆయన పేరు ఉందని పేర్కొంటూ.. అందుకు సంబంధించిన కాపీని కూడా రిలీజ్ చేసింది. ఆయన పాత ఈపీఐసీ నంబర్ తో చెక్ చేసి ఉంటారని, అందుకే లిస్టులో పేరు కనిపించకపోయి ఉండవచ్చని పేర్కొంది.

Next Story