- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల కమిషన్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది : పి.చిదంబరం
బిహార్లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) వేళ ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: బిహార్లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) వేళ ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. తాజాగా వచ్చిన ఓటర్ల లిస్టులో తనపేరు లేదని తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ఆరోపణలు చేయగా.. అందుకు ఈసీ సమాధానం కూడా చెప్పింది. తాజాగా.. కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం (P.Chidambaram) కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారంటూ.. తమిళనాడు సీఎంను ట్యాగ్ చేసి ఆదివారం ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు.
బిహార్‌లో 65 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదంలో ఉన్న తరుణంలో.. తమిళనాడులో 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారని, ఇది చట్టవిరుద్ధంగా కనిపిస్తోందని ఆయన పోస్టులో పేర్కొన్నారు. పెరిగిన ఓటర్లను శాశ్వత వలస కార్మికులుగా గుర్తించలేమని అలా చేస్తే అసలైన వలస కార్మికుల్ని అవమానించినట్లు అవుతుందన్నారు. తమిళనాడు ఓటర్లు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం లేకుండా ఓటర్ల పెరుగుదల జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని, రాష్ట్రంలో ఎన్నికల విధానాన్ని మార్చేందుకు ఈసీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ చేస్తోన్న అధికార దుర్వినియోగాన్ని రాజకీయంగా, చట్టబద్ధంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.






