రెండు దశల్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు.. నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్

by Prasad Jukanti |   (  Updated:2025-10-06 11:44:58  IST  )

బిహార్ అసెంబ్లీ ఎన్నికకు నగారా మోగింది.

రెండు దశల్లో బిహార్  అసెంబ్లీకి ఎన్నికలు.. నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బిహార్ అసెంబ్లీ ఎన్నికకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్.. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక కోసం నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటించారు. బిహార్ అసెంబ్లీకి రెండు దశల్లో నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్‌ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇక జూబ్లీహిల్స్ స్థానానికి నవంబర్‌ 11న ఎన్నిక నిర్వహించి నవంబర్‌ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కాగా బిహార్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణలు చేశాక జరుగుతున్న తొలి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడం, అక్కడ ఇప్పటికే ఎన్డీయే కూటమి అధికారంలో ఉండటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ మధ్య టగ్ ఆఫ్ వార్ గా మారాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ దేశ రాజకీయాల రూట్ మ్యాప్ గా ఈ ఎలక్షన్స్ ప్రధాన పాత్ర పోషించనున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ షెడ్యూల్‌:

గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ: 13 అక్టోబర్

నామినేషన్ల స్వీకరణకు తుది గడువు : 21 అక్టోబర్‌

నామినేషన్ల పరిశీలన: 22 అక్టోబర్‌

నామినేషన్ల ఉపసంహరణ గడువు: 24 అక్టోబర్

పోలింగ్‌ తేదీ : 11 నవంబర్

ఓట్ల లెక్కింపు: 14 నవంబర్‌

బిహార్ ఎన్నికల షెడ్యూల్‌ మొదటి ఫేజ్ (121 అసెంబ్లీ స్థానాలు)

గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ: 10 అక్టోబర్

నామినేషన్ల స్వీకరణకు తుది గడువు : 17 అక్టోబర్

నామినేషన్ల పరిశీలన:18 అక్టోబర్

నామినేషన్ల ఉపసంహరణ గడువు: 20 అక్టోబర్

పోలింగ్‌ తేదీ: 6 నవంబర్

ఓట్ల లెక్కింపు: 14 నవంబర్

బిహార్ ఎన్నికల షెడ్యూల్‌ సెకండ్ ఫేజ్ (122 అసెంబ్లీ స్థానాలకు)

గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ: 13 అక్టోబర్

నామినేషన్ల స్వీకరణకు తుది గడువు : 20 అక్టోబర్

నామినేషన్ల పరిశీలన:21 అక్టోబర్

నామినేషన్ల ఉపసంహరణ గడువు: 23 అక్టోబర్

పోలింగ్‌ తేదీ: 11 నవంబర్

ఓట్ల లెక్కింపు: 14 నవంబర్

బిహార్ లో మొత్తం 7.42 కోట్ల ఓటర్లు :

బిహార్ లో 243 అసెంబ్లీ స్థానాలకు గాను 203 జనరల్ స్థానాలు, 2 ఎఎస్టీ, 38 ఎస్సీ స్థానాలు రిజర్వుడ్ ఉన్నాయి. నవంబర్ 22తో బిహార్ అసెంబ్లీ పదవీ కాలం ముగియనుంది. ఆలోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి 17 నూతన సంస్కరణల అమలు చేస్తున్నట్లు తెలిపారు. బిహార్ లో మొత్తం 7.42 కోట్ల ఓటర్లు ఉండగా అందులో పురుష ఓటర్లు 3.92 కోట్లు, మహిళా ఓటర్లు 3.50 కోట్లు, ట్రాన్స్ జెండర్స్ 1725 మంది, 85 ఏళ్లకు పైబడిని ఓటర్లు 4.04 లక్షలు ఉన్నట్లు వెల్లడించారు. తొలిసారి ఓటర్లుగా నమోదైన వారు 14.01 లక్షల మంది ఉన్నారని తెలిపారు. దివ్యాంగులు, 85 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు.

Next Story