- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొంతు కోసినా.. ఆ పసికందు మృత్యువును జయించింది
కమలానెహ్రూ ఆసుపత్రి పిడియాట్రిక్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ ధీరేంద్ర నేతృత్వంలో పాపకు పలు శస్త్ర చికిత్సలు చేశారు.

- ఒక రోజు వయసున్న పాప గొంతు కోసిన అమ్మమ్మ
- చనిపోయిందనుకొని చెత్త కుప్పలో విసిరేసిన వైనం
- నెల రోజుల పాటు కష్టపడి బతికించిన డాక్టర్లు
దిశ, నేషనల్ బ్యూరో: అప్పుడే పుట్టిన పాపపై స్వయాన అమ్మమ్మ ఘాతుకానికి పాల్పడింది. తల్లి ఒడిలో ఉన్నప్పుడే ఒక రోజు వయసున్న పాప గొంతు కోసి చెత్త కుప్పలో పడేసింది ఓ మనసులేని అమ్మమ్మ. స్థానికులు ఆ పాప ఏడుపు విని పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు పసికందును ఆసుపత్రికి తరలించారు. నెల రోజుల పాటు ఆ పాపకు పలు శస్త్ర చికిత్సలు చేసి డాక్టర్లు బతికించారు. ఆ పాపకు డాక్టర్లే 'పీహూ' అని పేరు పెట్టారు. ఈ హృదయ విదాకర సంఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో ఓ మహిళ, తన తల్లితో కలిసి అప్పుడే పుట్టిన పాప గొంతు కోసింది. స్పృహ తప్పి పోయిన ఆ చిన్నారి చనిపోయిందని భావించి ఒక చెత్త కుండీలో పడేశారు. అయితే కాసేపటి తర్వాత చిన్నారి నొప్పికి ఏడ్వడం మొదలు పెట్టింది. చిన్నారి రోదనలు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు చిన్నారిని వెంటనే భోపాల్‌లోని కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించారు.
కమలానెహ్రూ ఆసుపత్రి పిడియాట్రిక్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ ధీరేంద్ర నేతృత్వంలో పాపకు పలు శస్త్ర చికిత్సలు చేశారు. పాప గొంతు కోసినా కీలకమైన నరాలు తెగిపోలేదు. దీంతో ఎంతో జాగ్రత్తగా గొంతు వద్ద కుట్లు వేశారు. నెల రోజుల్లో పలు శస్త్ర చికిత్సలు చేశామని.. వాటిని తట్టుకొని పాప బతకడం నిజంగా అద్బుతమని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఆ పాప కోసం తల్లిదండ్రులు ఎవరూ రాకపోవడంతో బాలల సంక్షేమ కమిటీ అనుమతితో రాజ్‌గఢ్‌లోని సంక్షేమ కేంద్రానిక తరలించినట్లు కమలానెహ్రూ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కాగా,ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమేరా ద్వారా లభించిన ఫుటేజీ ఆధారంగా ఇంతటి దారుణానికి ఒడిగట్టిన తల్లి, అమ్మమ్మను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.






