ఈజీ మనీ కోసం అడ్డదారులు.. కశ్మీర్‌లో నయా సోషల్‌ మీడియా దందా

by Naga Rani Yarlagadda |

ఈజీ మనీ కోసం కొందరు యువత అడ్డదారులు తొక్కుతున్నారు.

ఈజీ మనీ కోసం అడ్డదారులు.. కశ్మీర్‌లో నయా సోషల్‌ మీడియా దందా
X

దిశ, వెబ్‌డెస్క్: ఈజీ మనీ కోసం కొందరు యువత అడ్డదారులు తొక్కుతున్నారు. సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకునేందుకు, ప్రకటన దారుల నుంచి ఆదాయం పొందేందుకు వేర్పాటు వాదులు, ఉగ్రవాదుల్ని పొగడటం వంటి విద్వేషపూరిత కంటెంట్‌ను పోస్ట్ చేస్తుండటంతో.. కేవలం ఫాలోవర్లు, ఆదాయం కోసమే యువత ఇలా చేస్తున్నట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. అటువంటి ఖాతాలను మేనేజ్ చేస్తున్న యువతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ విషయం వెలుగు చూసింది.

వ్యక్తిగత ప్రయోజనాల కోసం సున్నితమైన అంశాలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు నిఘా పెంచారు. అలాగే దీనివల్ల పిల్లల భవిష్యత్ ఎంత ప్రభావితమవుతుందో కుటుంబాలకు అర్థమయ్యేలా వివరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలిపారు. ఇటీవలే ఏడుగురు యువకులకు ఈ వ్యవహారంపై తల్లిదండ్రుల ముందే కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా.. ఆర్థిక పరమైన కారణాలే కశ్మీర్ లోయలో ఇలాంటి పనులు చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ల సంఖ్య పెరగడానికి కారణమని భావిస్తున్నారు.

Next Story