- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జులై 1 నుంచి తత్కాల్ టికెట్లకు కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ల జారీకి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకు వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : తత్కాల్ టికెట్ల జారీకి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకు వచ్చింది. జులై 1 నుంచి తత్కాల్ టికెట్ల(Thatkal Tickets) బుకింగ్‌కు ఈ-ఆధార్ ధృవీకరణ తప్పనిసరి అని ప్రకటించింది. టికెట్లు కూడా ఖచ్చితంగా IRCTC యాప్ లోనే బుక్ చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Aswini Vaishnav) ఓ ప్రకటన జారీ చేశారు. ఈ కొత్త నియమం ద్వారా ప్రయాణికులకు అత్యవసర సమయంలో కన్ఫర్మ్ టికెట్లు సులభంగా దొరికే వెసులుబాటు కలగనుంది. అలాగే ఏజెంట్లు ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్‌లతో భారీగా టికెట్ల బ్లాక్ చేసుకునే దందాకు అడ్డుకట్ట పడనుంది. తత్కాల్ టికెట్ బుక్ చేసేటప్పుడు ప్రయాణికులు తమ ఆధార్ నంబర్‌తో లింక్ అయిన ఫోన్‌కు వచ్చే OTPతో గుర్తింపును నిర్ధారించాలి.
ఈ విధానం ద్వారా నకిలీ ఖాతాలు, బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు టికెట్ల విక్రయాన్ని నిరోధించవచ్చని, ఇప్పటికే AI సాయంతో 2.5 కోట్ల అనధికార ఐడీలను రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. అయితే, OTP ఆలస్యం కావడం వంటి సమస్యలు బుకింగ్‌ను అడ్డుకోవచ్చనే ఆందోళన కొందరు వ్యక్తం చేశారు. దీని కోసం రైల్వే శాఖ మరింత సాంకేతిక టెక్నాలజీని వాడనున్నట్టు తెలుస్తోంది.






