- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాలో రోతకు చైనా చెక్.. మరి భారత్ సంగతేంటి?
చైనా ఇన్ ప్లుయెన్సర్ల కంటెంట్ పై కఠిన బింధనలు తీసుకువచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా (social media) మనుషుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్‍ను చెరిపివేసింది. అంతకు ముందు ఉన్న అనేక అవాంతరాలను, అడ్డంకులను తొలగించేసింది. ప్రపంచంలో ఏ మూలన ఉన్న క్షణాల్లో ముచ్చటించుకునే సదుపాయం ఏర్పడింది. దీంతో సోషల్ మీడియా వినియోగం అతి తక్కువ కాలంలోనే ఓ విప్లవంగా మారి ఇప్పుడు అందరికి అత్యవసరం అనే పరిస్థితికి వచ్చింది. మొదట్లో ప్రజాస్వామ్య సాధనంగా పేరుపొందిన సోషల్ మీడియా.. క్రమ క్రమంగా ఇదో పరమ రోత అనే విమర్శలను మూటగట్టుకుంటోంది. రాజకీయాలు, క్రీడలు, వినోదంతో పాటు అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసిన సోషల్ మీడియా మాటున తప్పుడు సమాచార వ్యాప్తి, నేరాలకు ప్రోత్సాహం వంటి ముప్పు పొంచి అందరిని ఆదోళన కలిగిస్తోంది. దీంతో సోషల్ మీడియాపై ఓ వైపు హర్షం వ్యక్తం అవుతుంటే మరోవైపు ఆందోళనలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చైనా 'న్యూ ఇన్ ఫ్లుయెన్సర్ లా' పేరుతో కొత్త చట్టం అమల్లోకి తీసుకు వచ్చింది. మన పొరుగు దేశంలో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో భారత్‍లో సోషల్ మీడియా నియంత్రణ చర్చ తెరమీదకు వస్తోంది.
సామాజిక మాధ్యమాలను సరైన రీతుల్లో ఉపయోగించిన చోట్ల ఎన్నో మార్పులు, కొత్త ఆలోచనలు, పరిష్కారులు వెతకబడ్డాయి. అదే సమయంలో ఇవే వేదికలపై మాటలకందని జుగుప్సాకరమైన పోకడలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అసభ్యకరమైన కామెంట్లు, రోస్టింగ్ పేర్లతో ఇష్టారీతిన రెచ్చిపోతున్న నెటిజన్లు పెరిగిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో రోజు రోజుకు బలపడుతున్న ఇన్ ఫ్లుయెన్సర్స్ ట్రెండ్ అందరిని భయపెట్టేలా చేస్తోంది. ఇన్ ప్లుయెన్సర్లు చేసే పోస్టులు, వారు చెప్పే అంశాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. దీంతో ఎక్కువ మంది ఫాలోవర్స్ ను తెచ్చుకునేందుకు ఇన్ ప్లుయెన్సర్లు జనాలు ఎక్కువగా ఆదరించే ఆరోగ్యం, ఆర్థిక సూచనలపై మిడిమిడి జ్ఞానంతో ఏదేదో చెప్పేస్తున్నారు. దీంతో వీరు చెప్పేది నిజమే అని నమ్మిన అనేక మంది అమాయకులు బలవుతున్నారు. ఈ విధానానికి చెక్ పెట్టేందుకు తాజాగా చైనా తాజాగా కొత్త రూల్స్ (China influencer law) తీసుకువచ్చింది. దీని ప్రకారం అర్హత ఉంటేనే సోషల్ మీడియాలో కామెంట్స్ చేయాల్సి ఉంటుదంది. అలాగే ఆరోగ్యం, ఆర్థిక, న్యాయ, విద్య వంటి కీలక అంశాలపై మాట్లాడాలంటే సరైన నైపుణ్యంతో పాటు డిగ్రీ పట్టా, ప్రొఫెషనల్ లైసెన్స్ లాంటి ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. తప్పుడు సమాచార వ్యాప్తి, కోవర్ట్ ప్రమోషన్ల బారి నుండి ప్రజలను కాపాడే ఉద్దేశంతో ఈ నిబంధనలు తీసుకువచ్చినట్లు చైనా మీడియా పేర్కొంది. అలాగే కంటెంట్ క్రియేటర్ల వివరాలు వారి ఫోస్టులను వెరిపై చేయాల్సిన బాధ్యత సామాజిక మాధ్య వేదికలపై మోపింది. ఏఐ కంటెంట్ ఉపయోగిస్తే ఇది ఏఐ వీడియో అని స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది.
మరి భారత్ సంగతేంటి?:
చైనా తీసుకువచ్చిన ఈ కొత్త చట్టం ఇప్పుడు భారత్ లోనూ చర్చగా మారింది. చాలా కాలంగా ఇండియా సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు, కంటెంట్ కుప్పలు తెప్పలుగా ఎగబోస్తున్నారు. అయినా వాటిని నియంత్రణ పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడం లేదు. మారుతున్న సోషల్ మీడియాకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా యాక్ట్ 2023 తీసుకువచ్చింది. సైబర్ నేరాలు, ఫేక్ న్యూస్, హేట్ స్పీచ్ వంటి వాటిపై కఠినంగా వ్యవహిరస్తామని పేర్కొన్నారు. కానీ ఇప్పటికీ సైబర్ నేరాలు, అశ్లీల కామెంట్స్, కంటెంట్ డంప్ అవుతూనే ఉంది. రోస్టింగ్ పేరుతో కొంతమంది కేటుగాళ్లు ఫేక్ ఐడీలతో వావి వరుసలు లేకుండా కంటెంట్ క్రియేట్ చేయడం, మిడిమిడి జ్ఞానంతోనే ఆరోగ్య సలహాలు ఇస్తుండటం కామన్‍గా మారింది. చైనా కొత్త రూల్స్ నేపథ్యంలో ఇన్ ఫ్లుయెన్సర్ల పేరుతో తప్పుడు సమాచారం, అశ్లీలత కంటెంట్, కామెంట్స్ చేస్తున్న వారిపై ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టాలనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే చైనా తీసుకొచ్చిన కొత్త నిబంధనలు డిజిటల్ సెన్సార్ షిప్ కు కొత్త రూపం అని విమర్శలు చెబుతున్నారు. ఇది స్వతంత్ర గొంతులను ప్రభుత్వం అణచివేయాలనుకోవడమేనని చెబుతున్నారు. ఏది ఏమైనా సామాజిక మాధ్యమాల్లో నానాటికి పెరిగిపోతున్న ఫేక్ కంటెంట్, అశ్లీలతపై ప్రభుత్వాలు దృష్టి సారించి కఠిన నిబంధనలు అమలు చేయాల్సిందేననే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.






