- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమల్లోకి కొత్త లేబర్ కోడ్స్
నేటి నుంచి కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్ : నేటి నుంచి కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చాయి. కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వీటిలో కోడ్ ఆన్ వేజెస్(2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్(2020), కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ(2020), ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్(2020) వంటివి శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. కాగా గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీటిని తీసుకు వచ్చింది.
కొత్త లేబర్ కోడ్స్ వల్ల కలిగే ప్రయోజనాలివే..
* ప్రతినెలా 7వ తేదిలోపే వేతనాలు
*పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు, రాత్రి షిఫ్టులు చేసే అవకాశం
*ప్రమాదకర రంగాల్లో పనిచేసే వారికి 100% ఆరోగ్య భద్రత
*40 ఏళ్ళు పై బడిన కార్మికులకు ప్రతి సంవత్సరం ఫ్రీ హెల్త్ చెకప్
*గిగ్, ఫ్లాట్ ఫామ్ వర్కర్లకు గుర్తింపు. వీరికి కూడా PF, ESIC, ఇన్సూరెన్స్ వర్తింపు
*ఓవర్ టైం పనిచేసే కార్మికులకు డబుల్ పేమెంట్
*ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు ఏడాది తర్వాత గ్రాట్యుటీ






