New Fastag Rules : రేపటి నుంచి ఫాస్ట్ ట్యాగ్ కొత్త రూల్స్

by Y. Venkata Narasimha Reddy |
New Fastag Rules : రేపటి నుంచి  ఫాస్ట్ ట్యాగ్ కొత్త రూల్స్
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలోని వాహన వినియోగదారులకు కొత్త ఫాస్ట్ ట్యాగ్ నియమ నిబంధనలు(New Fast Tag Rules) రేపటి(Tomorrow) నుంచి అమల్లో(Implementation)కి రాబోతున్నాయి. ఫాస్ట్ ట్యాగ్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న వాహనదారులంతా కొత్త మార్పులను తప్పక తెలుసుకోవాలి. ఫిబ్రవరి 17, 2025 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ అమలు చేయనుంది. ఈ నియమాల ప్రకారం మీరు కొత్త చెల్లింపు విధానాలను పాటించకపోతే, అదనంగా మీరు ఫైన్ చెల్లించాల్సి రావచ్చు. అయితే కొత్తగా అమలు చేయనున్న రూల్స్ ఏంటనేది ఇప్పటికే వెల్లడయ్యాయి.

కొత్త రూల్స్ ఇవే...

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 2025 జనవరి 28న కొత్త నియమాలను జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 17, 2025 నుంచి మీరు టోల్ ప్లాజాకు చేరుకున్న తర్వాత 60 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే, ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్‌ అవుతుంది. ఆ సమయంలో చెల్లింపులు జరగవు. అదేవిధంగా ట్యాగ్‌ను టోల్ ప్లాజా వద్ద చూపించిన తర్వాత కనీసం 10 నిమిషాలకు బ్లాక్‌లిస్ట్ చేయబడితే కూడా చెల్లింపులు జరగవు. ఈ కొత్త నియమాల ప్రకారం వినియోగదారులకు 70 నిమిషాల సమయం లభిస్తుంది. దీని ద్వారా వారు తమ ఫాస్ట్ ట్యాగ్ స్థితిని అప్‌డేట్ చేసుకోవచ్చు.

టోల్ ప్లాజాకు చేరుకుని, చివరి క్షణంలో ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేస్తే, అది మీకు ప్రయోజనం చేకూర్చదు. మీ ట్యాగ్ ముందే బ్లాక్‌లిస్ట్ చేయబడితే, టోల్ ప్లాజా వద్ద రీఛార్జ్ చేసినా, చెల్లింపులు జరగవు. దీని కారణంగా మీరు రెట్టింపు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇది వినియోగదారులకు అదనపు భారంగా పరిణమించనుంది. అలాగే ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ లిస్ట్‌లో ఉన్నప్పుడు మీరు టోల్ ప్లాజాను దాటితే రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ సమయంలో మీరు 10 నిమిషాల ముందు ట్యాగ్ రీఛార్జ్ చేస్తే, మీరు పెనాల్టీ వాపసు పొందవచ్చు. దీనివల్ల మీరు అదనపు ఛార్జీలు చెల్లించకుండా ఉండవచ్చు.

బ్లాక్ లిస్ట్ లో ఉందా లేదా...

ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ లిస్ట్ స్థితిని తెలుసుకోవడం ద్వారా అదనపు భారాన్ని తప్పించుకోవచ్చు. ఇందుకోసం రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్‌ లో "ఈ-చలాన్ స్థితిని తనిఖీ చేయాలి" లేదా మరో ఆప్షన్‌ను ఎంచుకుని, వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసుకోవాలి. అప్పుడు వాహనం బ్లాక్ లిస్ట్‌లో ఉందో లేదో తెలుసుకోగలుగుతారు. కొత్త ఫాస్ట్ ట్యాగ్ నియమాలు అమలు కాకుండా ఉండాలంటే, పైన చెప్పిన నియమాలు పాటించడం తప్పనిసరి. మీరు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటప్పుడు, మీ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్‌ను చూసుకుని, అవసరమైతే ముందుగానే రీఛార్జ్ చేసుకుంటే అదనపు భారం నివారించుకోవచ్చు.

Advertisement
Next Story