మహారాష్ట్రలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజే ఎన్ని నమోదయ్యాయంటే..?

by S Gopi |

మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 711 కొత్త... New Covid Cases Up By 186% In Maharashtra, 4 Deaths In 24 Hours

మహారాష్ట్రలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజే ఎన్ని నమోదయ్యాయంటే..?
X

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 711 కొత్త కేసులు వెలుగుచూసినట్లు అధికారులు తెలిపారు. క్రితం రోజుతో పోలిస్తే ఇది దాదాపు 186 శాతం పెరుగుదల కావడం గమనార్హం. మరోవైపు అదే సమయంలో రాష్ట్రంలో 4 మరణాలు చోటుచేసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,792గా ఉంది. మరోవైపు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య మంత్రి తనాజీ సావంత్ అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 13-14న రాష్ట్రంలో కోవిడ్ సన్నద్ధతపై మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో సోలాపూర్, సంగ్లీ, సింధుదర్గ్, పూణే, సతరా జిల్లాల్లో భారీగా కేసులు వెలుగుచూస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Next Story