- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రపతి ముర్ముతో నూతన సీఈసీ భేటీ
దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా (CEC) రాజీవ్ కుమార్ పదవికాలం మంగళవారంతో ముగిసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా (CEC) రాజీవ్ కుమార్ పదవికాలం మంగళవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన స్థానంలో జ్ఞానేశ్ కుమార్ సీఈసీగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును (President Murmu) మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఈ సమావేశం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో ప్రధానంగా భవిష్యత్తు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలు, ఈవీఎం (EVM), వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (VVPAT) వాడకంపై సమీక్ష ఎన్నికల సంస్కరణల తదితర అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.
కాగా, గత ఏడాది మార్చిలో జ్ఞానేశ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. రాజీవ్ కుమార్ పదవి విరమణ పొందటంతో ప్రధాని మోడీ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ జ్ఞానేశ్ కుమార్ పేరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫారసు చేసింది. తర్వాత కొన్ని గంటల్లోనే సీఈసీగా జ్ఞానేశ్‌ను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జ్ఞానేశ్ కుమార్ 2029 జనవరి 26 వరకు సీఈసీ పదవిలో కొనసానున్నారు.
కొత్తగా సీఈసీగా నియమితులైన జ్ఞానేశ్ కుమార్ కేరళ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. ఈయన పార్లమెంటరీ మంత్రిత్వశాఖలో సెక్రటరీగా పనిచేశారు. అమిత్ షా నేతృత్వంలోని సహకార మంత్రిత్వ శాఖలోనూ సెక్రటరీగా పనిచేశారు. 2019లో కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసినపుడు జమ్మూకాశ్మీర్ ఇంఛార్జిగా ఉన్నారు.






