- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పకోడిలు తెమ్మని భర్తను పంపి ప్రియుడితో నవ వధువు జంప్!
పకోడీలు తీసుకురావాలని భర్తను పంపించిన నవ వధువు అతడు వచ్చేలోపే ప్రియుడితో పరారైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నో ఆశలతో వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడికి కొత్త పెళ్లాం ఊహించని షాకిచ్చింది. పుట్టింటి నుంచి తిరిగి వస్తూ మార్గమధ్యలోనే భర్తను వదిలేసి ప్రియుడితో జంప్ అయింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‍లో జరిగింది. మొరాబాద్‍కు చెందిన ప్రీతమ్ సింగ్‍కు రాంపూర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల రిమ్జిమ్ తో గతేడాది డిసెంబర్ 1న వివాహం జరిగింది. ఇటీవల జరిగిన హోళీ పండగ కోసం రిమ్జిమ్ తన పుట్టింటికి వెళ్లింది. పండగ ముగియడంతో మార్చి 9న తన భార్యను తిరిగి తీసుకురావడానికి ప్రీతమ్ సింగ్ అత్తారింటికి వెళ్లాడు. తన భార్యను తీసుకుని తన గ్రామానికి బయలుదేరాడు.
భర్తను నైస్‍గా పంపి:
ఈ క్రమంలో బిలారీ బస్టాండ్‍లో మరో బస్సుకోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో తనకు ఆకలిగా ఉందని వేడి వేడి పకోడీలు తీసుకురావాలని రిమ్జిమ్ తన భర్తను కోరింది. దీంతో అక్కడి నుంచి బయటకు వెళ్లిన ప్రీతమ్ పకోడీలు తీసుకుని తిరిగి వచ్చేసరికి తన భార్య కనిపించలేదు.మొదట్లో ఈ చుట్టుపక్కలే ఎక్కోడో ఉంటుందని భావించి అంతటా వెతికాడు. కానీ ఆమె జాడ ఎక్కడ కనిపించకపోవడంతో బస్టాండ్ ఆ చుట్టుపక్కల వారిని ఆరా తీశాడు. వారంతా తమకు తెలియదని చెప్పడంతో మరింత ఆందోళన చెందాడు. ఇక ఎంత వెతికినా తన భార్య కనిపించకపోవడంతో ప్రీతమ్ పోలీస్ స్టేషన్‍కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అయితే రిమ్జిమ్ తన పుట్టింటి గ్రామానికి చెదిన యువకుడితో పరారై ఉంటుందని ప్రీతమ్ అనుమానం వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్జాండ్ పరిసరాల్లోని సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అలాగే ఆమె మొబైల్ లొకేషన్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.






