కొత్త జంతు వధ నిబంధనలు.. ఉల్లంఘిస్తే 6 నెలల జైలు, జరిమానా!

by Kema Shiva Kumar |

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జంతు వధకు సంబంధించి కొత్త నిబంధనలను జారీ చేసింది.

కొత్త జంతు వధ నిబంధనలు.. ఉల్లంఘిస్తే 6 నెలల జైలు, జరిమానా!
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని బీజేపీ ప్రభుత్వం జంతువుల సంరక్షణ, వధకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా జంతువులను వధించడం, నిబంధనలకు విరుద్ధంగా క్రయవిక్రయాలపై ఉక్కుపాదం మోపుతూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అయితే, ఆ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 6 నెలల వరకు జైలు శిక్ష, రూ.1,000 వరకు జరిమానా, కొన్ని సందర్భాల్లో రెండు శిక్షలను కూడా విధించనున్నారు. లైసెన్స్ పొందిన కబేళాల్లో (Slaughter Houses) మాత్రమే వధ జరపాలని, అది కూడా వెటర్నరీ డాక్టర్ ధృవీకరణ తర్వాతే జరగాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

బహిరంగ వధపై పూర్తిగా నిషేధం..

బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల పక్కన జంతువులను వధించడంపై రాష్ట్రవాప్తంగా పూర్తిగా నిషేధం విధించారు. ఇది ప్రజారోగ్యం. పారిశుధ్యం దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని అధికారులు వెల్లడించారు. వధకు ఎంపిక చేసే జంతువుల వయస్సు, ఆరోగ్య స్థితిపై పక్కా నిబంధనలను అమలు చేయనున్నారు. కాగా, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ (TMC) ప్రభుత్వం పోయి, బీజేపీ అధికారంలోకి రాగనే ఈ నిర్ణయం తీసుకోవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story