- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇక వారిని మన దరిదాపుల్లోకి రానివ్వొద్దు.. కాంగ్రెస్‍పై డీఎంకే ఫైర్
దేశవ్యాప్తంగా బీజేపీ ఎదుగుదలకు మోడీ, అమిత్ షా కారణం కాదని కాంగ్రెస్ పార్టీనే కారణం అని డీఎంకే ఆరోపించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి మద్దతు విషయంలో డీఎంకే, కాంగ్రెస్ మధ్య ఉన్న లాంగ్ టర్మ్ ఫ్రెండ్ షిప్‍కు బ్రేక్ పడిన సగతి తెలిసిందే. విజయ్ ప్రభుత్వానికి మద్దతు విషయంలో కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించిందని ఆగ్రహంతో రగిలిపోతున్న డీఎంకే మరోసారి కాంగ్రెస్ పార్టీపై ఎటాక్ చేసింది. తాజాగా జరిగిన పార్టీ మీటింగ్ లో డీఎంకే ముఖ్యనేత ఉదయనిధి స్టాలిన్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు కనీస కృతజ్ఞత, మర్యాద కొరవడిందని మండిపడ్డారు. డీఎంకే ఇకపై కాంగ్రెస్‌ను ఎన్నటికీ విశ్వసించకూడదని, కనీసం ఆ పార్టీని మన దరిదాపుల్లోకి కూడా రానివ్వొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మా వల్లే మీకు ఐదు సీట్లు:
కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలను గెలవడానికి డీఎంకే కార్యకర్తలే కారణం అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు వారికి ఓటు వేశారని కానీ ఈరోజు కొన్ని పదవుల కోసం మాకు సమాచారం ఇవ్వకుండా పారిపోయారని దుయ్యబట్టారు. తమిళనాడు ప్రజలు అతి త్వరలోనే వారికి తగిన గుణపాఠం నేర్పిస్తారన్నారు. తమ మిత్రపక్షాల కష్టార్జితంపై బతుకుతున్న కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటుదారులు, జలగలతో అభివర్ణించారు.
బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్సే కారణం:
భారతదేశవ్యాప్తంగా బీజేపీ విజయానికి ప్రధాని మోడీ, అమిత్ షా కారణమని నేను భావించాను. కానీ భారతదేశంలో బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్ కారణమని ఇప్పుడు స్పష్టమైందని ఉదయనిధి అన్నారు. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మా నాయకుడు ఎంకే స్టాలిన్ కాంగ్రెస్‌ను తన భుజాలపై మోశారన్నారు.






