దేశంలోనే అతి పేద వ్యక్తి.. ఏడాది సంపాదన రూ.3 మాత్రమే!

by Phanindra |

ఒక రైతు వార్షిక ఆదాయం రూ.3 మాత్రమే అని పేర్కొంటూ ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చింది ప్రభుత్వం. దీంతో దేశంలోనే అతి పేద వ్యక్తి ఇతనే అంటూ ట్రోలింగ్ జరిగింది.

దేశంలోనే అతి పేద వ్యక్తి.. ఏడాది సంపాదన రూ.3 మాత్రమే!
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోనే అతిపేద రైతు.. మధ్యప్రదేశ్‌లో కనిపించారు. సదరు రైతు వార్షిక ఆదాయం కేవలం మూడు రూపాయలే కావడం గమనార్హం. సత్నా జిల్లా కోఠీ మండలానికి చెందిన రామ్‌స్వరూప్‌ అనే ఒక రైతు ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. జులై 22న ఇది ఆయనకు అందింది. ఈ సర్టిఫికెట్‌పై స్థానిక తహసీల్దార్‌ సౌరభ్‌ ద్వివేదీ సంతకం కూడా ఉంది. అయితే ఈ ధ్రువపత్రంలో రామ్‌స్వరూప్ వార్షిక ఆదాయం మాత్రం కేవలం రూ.3గా ఉంది.

ఇది చూసిన సదరు రైతు కూడా ఆశ్చర్యపోయాడు. అంటే అతని నెలవారీ ఆదాయం కేవలం 25 పైసలే అన్నమాట. ఈ ధ్రువపత్రం నెట్టింట బాగా వైరలయింది. దేశంలో అత్యంత పేద వ్యక్తి ఇతనే అంటూ అధికారులను నెటిజన్లు ట్రోల్ చేశారు. దీంతో తమ తప్పు తెలుసుకున్న అధికారులు.. క్లరికల్‌ లోపం వల్ల ఈ తప్పు నమోదైందని గుర్తించి, జులై 25న కొత్త ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశారు. అందులో రామ్ స్వరూప్ ఆదాయం ఏడాదికి రూ.30 వేలుగా పేర్కొన్నారు.

Next Story