- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Naa Anveshana: అన్వేష్ (నా అన్వేషణ) అరెస్ట్ కాబోతున్నాడా?
నా అన్వేషణ అన్వేష్ పై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ యూట్యూబర్, నా అన్వేషణ అన్వేష్ పై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన కామెంట్స్ తీవ్రదుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత రాగా.. సోషల్ మీడియాలో మాత్రం శివాజీకే సపోర్ట్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ విషయంపై ప్రముఖ యూట్యూబర్, వ్లాగర్ నా అన్వేషణ అన్వేష్ చేసిన వీడియోలపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పచ్చిబూతులు మాట్లాడుతూ చేసిన వీడియోలతో అతడిని అన్ ఫాలో చేయడంతో పాటు.. అకౌంట్ రిపోర్ట్ కొడుతున్నారు. నిన్న ఇన్ స్టాలో అతని ఫాలోవర్స్ 1.8 మిలియన్స్ ఉండగా.. ఈరోజు 1.6 మిలియన్ కు తగ్గిపోయారు.
సారీ చెప్తే సరిపోతుందా?
భారీగా ఫాలోవర్స్ అన్ ఫాలో కొట్టడం, అకౌంట్ రిపోర్ట్ చేస్తుండటంతో అన్వేష్ తన వ్యాఖ్యలకు సారీ చెప్తూ మరో వీడియో పోస్ట్ చేశాడు. శివాజీని, గరికపాటిని అనరాని మాటలు అంటూ.. హిందూ దేవుళ్లను సైతం అవమానించాడు. సీతాదేవి, ద్రౌపది గురించి చేసిన వ్యాఖ్యలతో నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. విశ్వహిందూ పరిషత్ సంస్థ కూడా అన్వేష్ వీడియోలపై స్పందించి.. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విదేశాల్లో ఉన్న అతనిపై చర్యలు తీసుకోవడం ఎలా? పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే గానీ ఇలాంటి కాంట్రవర్సీ టాపిక్స్ లోకి దూరి ఇష్టానికి మాట్లాడటం ఆపడని అంటున్నారు. అనాల్సినవన్నీ అనేసి సారీ చెప్పేస్తే సరిపోతుందా అని మండిపడుతున్నారు. ఒక్కసారైనా కటకటాల్లోకి వెళ్తే తిక్క కుదురుతుందంటున్నారు.
చట్టపరమైన చర్యలకు డిమాండ్
మహిళల వస్త్రధారణపై రెండు మాటలు మాట్లాడిన శివాజీనే మహిళా కమిషన్ పిలిచి ప్రశ్నించిందని, అన్వేష్ మాట్లాడిన మాటలను సుమోటాగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అతన్ని ఇండియాకు రప్పించి, కేసులు నమోదు చేసి పాస్ పోర్ట్ సీజ్ చేయాలని, అలాగే అతని యూట్యూబ్ ఛానల్ కు రిపోర్ట్ చేసి మూసివేయించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అమ్మాయిలు అలా బట్టలు వేసుకుంటే తాను కూడా ఆనందిస్తానని స్టేట్మెంట్ ఇచ్చిన అన్వేష్ కు గరికపాటి గురించి మాట్లాడే హక్కు లేదంటున్నారు. విదేశాల నుంచి రానంటున్న అతన్ని పట్టుకునేందుకు ఇంటర్ పోల్ వెళ్తే సరిపోతుందంటున్నారు నెటిజన్లు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయన్ని సీరియస్ గా తీసుకుని, అన్వేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






