- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ahmedabad Plane Crash : ప్రధాని మోడీ రాజీనామా చేయాలన్న సుబ్రమణ్యన్.. ఖండించిన నెటిజన్స్
అహ్మదాబాద్ లో గురువారం ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ లో గురువారం ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన కొన్ని సెకన్లలోనే ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతోసహ ఇప్పటి వరకు 265 మంది చనిపోయారు. అయితే ఈ విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) రాజీనామా చేయాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్యన్ స్వామి(Subramanyan Swamy) డిమాండ్ చేశారు.
1950లో రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. అదే నైతికతో మోడీ కూడా రాజీనామా చేస్తే.. విచారణ పారదర్శకంగా జరుగుతుందని తెలుపుతూ సుబ్రమణ్యన్ స్వామి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేగుతుండగా.. నెటిజన్స్ సుబ్రమణ్యన్ పై మండిపడుతున్నారు. విమానం కూలిపోతే ప్రధాని ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఆ శాఖ మంత్రిని రాజీనామా చేయమని అడగడంలో న్యాయం ఉంది గాని, ప్రధాని అందుకు ఎలా బాధ్యుడు అవుతాడని నిలదీస్తున్నారు.






