- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివాదాస్పదంగా మారిన ఫొటో.. ప్రధాని మోదీపై నెటిజన్ల విమర్శలు
ఇటీవల బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్మార్టర్ భారత్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్మార్టర్ భారత్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రధాని నరేంద్రమోదీ, కీర్ స్టార్మర్ కలిసి దిగిన ఫొటో ఇప్పుడు నెటిజన్ల విమర్శలకు గురవుతోంది. ఇద్దరూ కారులో ప్రయాణిస్తుండగా తీసిన ఫొటోలో బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ సీటు బెల్టు ధరించి ఉండగా.. ప్రధాని మోదీ మాత్రం ఎలాంటి సీటు బెల్టు పెట్టుకోకుండా కెమెరాకు ఫోజులిస్తూ కనిపించారు. ప్రధాని హోదాలో ఉన్న మోదీ.. రోడ్డు భద్రతా నియమాలను పాటించలేదని, ప్రధానే నియమ, నిబంధనలను ఉల్లంఘించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రధానే ఇలా చేస్తే.. ఇతర పౌరులు నిబంధనలు ఎలా పాటిస్తారని నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా.. మనదేశ ఆర్థిక వ్యవస్థపై కీర్ ప్రశంసల జల్లు కురిపించారు. భారత్ జపాన్ ను అధిగమించి.. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.






