‘అది ఓ ఇల్లు.. అలా ఎలా కట్టారో’.. ఆ గోడను చూసి నెటిజన్లు షాక్

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-04 07:58:18  IST  )

సాధారణంగా ఇల్లు నిర్మించుకోవాలంటే ఇంటి నిర్మాణానికి కావాల్సినంతా స్థలం చూస్తారు.

‘అది ఓ ఇల్లు.. అలా ఎలా కట్టారో’.. ఆ గోడను చూసి నెటిజన్లు షాక్
X

దిశ,వెబ్‌డెస్క్: ఇంటి నిర్మాణంలో ప్లానింగ్ అనేది అత్యంత కీలకమైన అంశం. మనకు నచ్చిన విధంగా ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే, ఆ బిల్డింగ్ ప్లానింగ్ కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించడానికి ఆర్కిటెక్ట్‌లు, సివిల్ ఇంజనీర్లు మరియు ఇంటీరియర్ డిజైనర్‌ల వంటి నిపుణులు అభిప్రాయాలు అవసరం. సాధారణంగా ఇల్లు నిర్మించుకోవాలంటే ఇంటి నిర్మాణానికి కావాల్సినంతా స్థలం చూస్తారు. తర్వాత స్థల పరిమాణం ఆధారంగా చిన్నగా లేదా పెద్దగా ఇంటిని నిర్మించుకోవడం జరుగుతుంది. ఇకపోతే.. ఇంటి నిర్మాణంలో గోడలు చాలా ముఖ్యమైన భాగం. గోడలు ఇంటికి నిర్మాణాన్ని అందిస్తాయి. అలాగే, ఇంటి లోపలి భాగాన్ని బయటి ప్రపంచం నుంచి వేరు చేస్తాయి. ఇంట్లో గదులను ఏర్పాటు చేయాలన్న కూడా మధ్యలో గోడలుగా ఏర్పాటు చేయాల్సిందే. వాస్తవానికి గోడలు ఇంటిని గాలి, వర్షం, ఇతర వాతావరణ పరిస్థితుల నుంచి రక్షిస్తాయి.

కానీ.. రాష్ట్రంలో ఓ ఇల్లుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. బీహార్‌లోని ఖగడియాలో అతి తక్కువ వెడల్పుతో ఇల్లు నిర్మించారు. ఆ ఇల్లు కట్టడం పై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇంటిని చూసిన వారు ఇది ఎలా సాధ్యం అది గోడ మాదిరిగా ఉందని షాక్‌కు గురవుతున్నారు. అందులో మనుషులు నివసించడం సాధ్యమేనా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇది ‘బీహార్.. ఇక్కడ ఏదైనా సాధ్యమే’ అంటూ ఫన్నీగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story