- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Netanyahu : మా దెబ్బకు ఇరాన్ సుప్రీం ఖమేనీ బతికి ఉండే ఛాన్సే లేదు !
వైమానిక దాడుల నేపథ్యంలో ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయి ఉంటాడని పేర్కొన్నారు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు.

Netanyahu says Khamenei may be no longer alive
దిశ, వెబ్ న్యూస్: ఇరాన్ వర్సెస్ అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు బాంబుల దాడులతో విరుచుకుపడుతున్నారు. కోట్లాది ఆస్తి నష్టం తో పాటు అమాయకులు చనిపోతున్నారు. ఇరాన్ లో నాయకత్వం మార్పు దిశగా అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగానే సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ( Ayatollah Ali Khamenei) లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు చేసింది. ప్రస్తుతం అలీ ఖమేనీ పరిస్థితి ఎలా ఉందో తెలియ రాలేదు. ఓ రహస్య ప్రాంతానికి అతడు చేరుకున్నట్లు చెబుతున్నారు.
ఇలాంటి నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యహు ( Benjamin Netanyahu) కీలక ప్రకటన చేశారు. తమ వైమానిక దాడుల నేపథ్యంలో అయతుల్లా అలీ ఖమేనీ ప్రాంగణం మొత్తం ధ్వంసం అయిందని పేర్కొన్నారు. ఇక ఈ సంఘటనలో అలీ ఖమేనీ ఇప్పటికే మరణించి ఉంటారని వెల్లడించారు నెతాన్యహు. ఆయన జాడ ఇప్పటి వరకు తెలియ రాలేదు.. దీంతో మృతి చెంది ఉంటాడని నెతాన్యహు వెల్లడించారు. ఇది ఇలా ఉండగా, అమెరికా-ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడుతోంది ఇరాన్. ఈ తరుణంలోనే పాకిస్తాన్ వ్యక్తి కూడా అబుదాబీలో మరణించాడు.






