Israel-Iran Conflicts: ఇరాన్ 'భారీ మూల్యం' చెల్లించక తప్పదు: నెతన్యాహు వార్నింగ్

by S Gopi |

ఇజ్రాయెల్ పౌరులను చంపినదానికి ఇరాన్ బదులు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

Israel-Iran Conflicts: ఇరాన్ భారీ మూల్యం చెల్లించక తప్పదు: నెతన్యాహు వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్నాయి. ఇజ్రాయ్ల్ ప్రారంభించిన 'ఆపరేషన్ రైజింగ్ లయన్ ' ఆపరేషన్ ద్వారా భీకర దాడులను నిర్వహిస్తోంది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ప్రతిదాడులు చేపడుతోంది. వరుస క్షిపణి దాడులతో ఇజ్రీయెల్‌లో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు తీవ్రస్థాయిలో ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ పౌరులను చంపినదానికి ఇరాన్ బదులు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. టెల్ అవీవ్ సమీపంలో ఇరాన్ చేసిన క్షిపణి దాడి ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన, తాము అస్తిత్వ పోరాటం చేస్తున్నాం. తమ నగరాలు, పౌరులపై ఇరాన్ వాడుతున్న అణ్వాయుధాల గురించి ఆలోచించండి. అలాంటి 20,000 ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించండి. ఈ పరిణామం తమ ఉనికికే ముప్పుగా పరిణమిస్తుంది. ఈ కారణానికే యుద్ధాన్ని మొదలుపెట్టాం. ఉద్దేశపూర్వకంగా ఇరాన్ చేస్తున్న దాడులకు భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. పూర్తి సామర్థ్యంతో ఇరాన్ లక్ష్యంగా దాడులు నిర్వహిస్తామని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్ దాడులు చేసే సమయంలో సైనికాధికారులు చేసే సూచనలు పాటించాలని ప్రజలకు సూచించారు. ఇరాన్ ఎలాంటి హెచ్చరికలు లేకుండా దాడులు చేస్తోందని, తాము ఇరాన్ ప్రజలకు హానీ కలిగించకుండా దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు ఇజ్రాయెల్ రక్షణ డళ(ఐడీఎఫ్) ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ డెఫ్రిన్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

Next Story