Nethanyahu: గాజాలో భారీ దాడులకు సిద్ధం.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వార్నింగ్

by B.Srinivas |

ఉగ్రవాద సంస్థ హమాస్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు గాను తమ సైన్యం దాడులను తీవ్ర తరం చేస్తోందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు.

Nethanyahu: గాజాలో భారీ దాడులకు సిద్ధం.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాద సంస్థ హమాస్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు గాను తమ సైన్యం దాడులను తీవ్ర తరం చేస్తోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin nethanyahu) తెలిపారు. ఆదివారం ఆయన ఆ దేశ కేబినెట్ సమావేశంలో ప్రసంగించారు. గాజా నగరంలో భారీ దాడులు చేపట్టేందేకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) సిద్ధమవుతోందని హెచ్చరించారు. గాజా పౌరులు సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లడానికి వీలుగా ఇజ్రాయెల్ మరొక మానవతా మండలాన్ని ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. ‘గాజాలో భారీ అటాక్‌కు ఐడీఎఫ్ సిద్ధమవుతోంది. ఆకాశం నుంచి కరపత్రాలను జారవిడిచి, ప్రజలను సిటీ ఖాళీ చేయమని ఆదేశించాం. ఇప్పటికే లక్ష మందికి పైగా గాజా నగరాన్ని విడిచిపెట్టారు’ అని వ్యాఖ్యానించారు. అయితే హమాస్ పౌరుల తరలింపులను ఆపడానికి ప్రయత్నిస్తోందని, వారిని మానవ కవచాలుగా ఉపయోగించాలని కోరుకుంటుందని ఆరోపించారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయడంతో పాటు వారి శిబిరాలను ధ్వంసం చేస్తున్నామని చెప్పారు.

కాగా, గాజా నగరాన్ని హమాస్‌కు బలమైన స్థావరంగా ఐడీఎఫ్ ప్రకటించింది. దీంతో నగరం లోపలి ప్రాంతాల్లో అటాక్ చేసేందుకు రెడీ అవుతోంది. దీని కారణంగా దక్షిణ గాజాలోని మానవతా శిబిరాలకు వెళ్లాలని ప్రజలను ఆదేశించింది. ఆ ప్రదేశంలో తాత్కాలిక ఆస్పత్రులు, ఆహారం, నీరు ఏర్పాటు చేస్తామని తెలిపింది. ప్రజలు సురక్షితమైన మార్గం ద్వారా వాహనాల్లో వెళ్లొచ్చని పేర్కొంది. ఈ క్రమంలోనే నెతన్యాహు వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు మానవతా జోన్‌ను ఇజ్రాయెల్ మాత్రమే ప్రకటించిందని, ఈ విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని ఐక్యరాజ్యసమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు తెలిపాయి.

Next Story