- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nethanyahu: తొలిసారి కోర్టు బోనెక్కిన నెతన్యాహు.. మోసం, అవినీతి కేసుల్లో విచారణకు హాజరు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తొలిసారి కోర్టు బోనెక్కారు. అవినీతి ఆరోపణలపై సాక్ష్యం చెప్పేందుకు ఆయన మంగళవారం కోర్టుకు హాజరయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin nethanyahu) తొలిసారి కోర్టు బోనెక్కారు. అవినీతి ఆరోపణలపై సాక్ష్యం చెప్పేందుకు ఆయన మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. టెల్ అవీవ్ (Tel aviv) లోని జిల్లా కోర్టుకు చేరుకున్న ఆయన నవ్వుతూ న్యాయవాదులను పలకరించారు. విచారణలో భాగంగా కోర్టులో సాక్ష్యం చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. నిజం చెప్పడానికి నేను ఈ క్షణం కోసం ఎనిమిదేళ్లుగా వేచి ఉన్నా అని తెలిపారు. అయితే భద్రతా కారణాల దృష్యా విచారణను టెల్ అవీవ్‌లోని భూగర్భంలో ఉన్న బంకర్‌లో చేపట్టారు. ఒక సిట్టింగ్ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి న్యాయస్థానంలో నిలబడి ప్రతివాదిగా సాక్ష్యమివ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
మోసం, నమ్మక ద్రోహం, లంచం తీసుకోవడం వంటి మూడు వేర్వేరు ఆరోపణలపై నెతన్యాహు విచారణను ఎదుర్కొంటున్నాడు. అయితే వీటిని ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. మరోవైపు నెతన్యాహుపై కోర్టులో విచారణ జరుగుతుండగానే న్యాయస్థానం బయట అనేక మంది ప్రజలు ఆందోళన చేపట్టారు. గాజాలో హమాస్ చేతిలో ఉన్న బందీలను విడుదల చేయడానికి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కాగా, నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఇటీవల అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. గాజాలో యుద్ధ నేరాలు వంటి వాటిపై కోర్టు అభియోగాలు మోపింది.






