దారుణం.. దొంగ అని అమ్మాయిని కట్టేసి కొట్టిన చిల్లరగాళ్లు.. కాదని వారించినా.. రక్తం కళ్లజూశారు..(వీడియో)

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ బరేలీలో దారుణం చోటు చేసుకుంది. నేపాల్‌కు చెందిన సుష్మిత అనే అమ్మాయి నోయిడాలో వర్క్ చేస్తుంది. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా స్నేహితులను కలిసేందుకు బరేలీకి వచ్చింది. రాత్రి ఒంటి గంట సమయంలో ఆమె టెర్రస్‌పై ఫోన్ మాట్లాడుతుండగా..

దారుణం.. దొంగ అని అమ్మాయిని కట్టేసి కొట్టిన చిల్లరగాళ్లు.. కాదని వారించినా.. రక్తం కళ్లజూశారు..(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ బరేలీలో దారుణం చోటు చేసుకుంది. నేపాల్‌కు చెందిన సుష్మిత అనే అమ్మాయి నోయిడాలో వర్క్ చేస్తుంది. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా స్నేహితులను కలిసేందుకు బరేలీకి వచ్చింది. రాత్రి ఒంటి గంట సమయంలో ఆమె టెర్రస్‌పై ఫోన్ మాట్లాడుతుండగా.. దొంగ లాగా అనిపించడంతో.. ఆమెను కట్టేసి కొట్టారు కొందరు యువకులు. గొడ్డలి, గడ్డపార, కట్టెలతో రక్తం వచ్చేలా బాదారు. తాను అలాంటి దాన్ని కాదని చెప్తున్నా వినకుండా ఇష్టమొచ్చినట్లు కొట్టారు. దీంతో అమ్మాయికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ఈ ఘటనలో సుష్మిత శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. రెండు పళ్లు ఊడిపోవడంతోపాటు కాలు ఫ్రాక్చర్ అయింది. దీంతో ఆమెను కోకిలా ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుండగా.. నిందితులపై అల్లర్లు, చట్టవిరుద్ధంగా బంధించడం, గాయపరచడం కింద కేసు నమోదు చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామని.. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు పోలీసులు.

VIDEO

Next Story