- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nepal: దేశంలో చట్ట పాలనను తీసుకొస్తాం.. నేపాల్ మాజీ ప్రధాని కేపీ ఓలీ
నేపాల్‌లోని ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వంపై మాజీ ప్రధాని కేపీ ఓలీ విమర్శలు గుప్పించారు. జెన్ జీ ప్రభుత్వం ఉత్త పబ్లిసిటీ ప్రభుత్వమని అభివర్ణించారు.

దిశ, నేషనల్ బ్యూరో: నేపాల్‌లోని ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వంపై మాజీ ప్రధాని కేపీ ఓలీ(Kp oli) విమర్శలు గుప్పించారు. జెన్ జీ ప్రభుత్వం ఉత్త పబ్లిసిటీ ప్రభుత్వమని అభివర్ణించారు. అది రాజ్యాంగ నిబంధనలు అనుసరించి ఏర్పడలేదని, విధ్వంసం, దహనం ద్వారా తయారు చేయబడిందని మండిపడ్డారు. జెన్ జీ నిరసనల తర్వాత రాజీనామా చేసిన ఆయన తొలిసారిగా సీపీఎన్-యూఎంఎల్ విద్యార్థి విభాగం నిర్వహించిన ఓ బహిరంగ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. హింసను మరింత తీవ్రం చేయకూడదనే ఉద్దేశంతోనే పదవికి రిజైన్ చేసినట్టు స్పష్టం చేశారు. దేశాన్ని రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి అనుగుణంగా తయారు చేయాలని తెలిపారు. తాము ఈ దేశాన్ని విడిచి విదేశాలకు పారిపోతామని పబ్లిసిటీ ప్రభుత్వం భావిస్తోందని, కానీ దేశంలో మళ్లీ చట్ట పాలనను తీసుకొస్తామని దీమా వ్యక్తం చేశారు. రాజకీయాలను తిరిగి గాడిలో పెడతామని చెప్పారు.






