- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nepal: నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్.. ఫేస్ బుక్, యూట్యూబ్ సహా 26 ప్లాట్‌ఫామ్‌లకు గుడ్‌బై !
నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై కఠిన చర్యలు తీసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని సోషల్ మీడియా (Social media) ప్లాట్‌ఫామ్‌లపై కఠిన చర్యలు తీసుకుంది. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్ చాట్ సహా 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించింది. ఈ మేరకు ఆదేశ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా కంపెనీలు ప్రభుత్వం వద్ద అధికారికంగా రిజిస్టర్ చేసుకోవాల్సిన నిబంధనలను సరిగా పాటించలేదని తెలిపింది. ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవడానికి గడువు సైతం ఇచ్చామని కానీ ఈ నియమాన్ని పాటించడంలో సదరు సంస్థలు విఫలమయ్యాయని పేర్కొంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో నకిలీ ఐడీలు కలిగిన యూజర్లు వాటిని ఉపయోగించి ద్వేషాన్ని, పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇది సమాజంలో అశాంతికి దారి తీస్తుందని తెలిపింది. నేపాల్‌లో విస్తృతంగా ఉపయోగించే ప్లాట్‌ఫామ్‌లకు నమోదు చేసుకోవాలని పదేపదే నోటీసులిచ్చినా స్పందించలేదని మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్ తెలిపారు. అందుకే ఈ డిసిషన్ తీసుకున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం తర్వాత, నేపాల్‌లోని ఇంటర్నెట్ వినియోగదారులు ఫేస్ బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయలేకపోయారని పలు కథనాలు పేర్కొన్నాయి.






