- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిగొచ్చిన నేపాల్ ప్రభుత్వం.. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేత
నిరసనలు తీవ్రతరం కావడంతో నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసింది. అత్యవసరంగా కేబినెట్ సమావేశం నిర్వహించి ప్రభుత్వం నిషేదాన్ని ఉపసంహరించుకుంది.

దిశ, వెబ్ డెస్క్: నిరసనలు తీవ్రతరం కావడంతో నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసింది. అత్యవసరంగా కేబినెట్ సమావేశం నిర్వహించి ప్రభుత్వం నిషేదాన్ని ఉపసంహరించుకుంది. ఈ మేరకు నేపాల్ కమ్యూనికేషన్ మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్ మీడియాకు వెల్లడించారు. దీంతో ప్రస్తుతం నేపాల్‌లో అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పనిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియా మతపరమైన విద్వేషాలు, ఫేక్ న్యూస్ ప్రచారం ఎక్కువ అవ్వడంతో అన్ని సోషల్ మీడియా సంస్థలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఆ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో 26 సోషల్ మీడియా సంస్థలను నిషేదించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అందులో ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ లాంటి ప్రముఖ యాప్స్ సైతం ఉన్నాయి. అయితే బ్యాన్ తరవాత దేశంలోని యువత అంతా రోడ్లపైకి వచ్చారు. నేపాల్ రణరంగంగా మారిపోయింది. సోమవారం విద్యార్థులు, యువత నేపాల్ రాజధాని కాఠ్మండులో నిరసన వ్యక్తం చేశారు.
ఈ నిరసన తీవ్రరూపం దాల్చగా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు వాటర్ క్యానన్‌లతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఘర్షణలో దాదాపు 20 మంది మరణించగా మరో 250 మంది గాయపడ్డారు. నిరసనలు మరింత తీవ్రతరం అయ్యాయి. యువత ప్రధాని ఇంటినే ముట్టడించారు. దీంతో నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. నేడు బ్యాన్ ఎత్తివేసిన ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.






