ఎవరెస్టు ఎక్కాలంటే రూ.13 లక్షలు కట్టాల్సిందే

by Ajay Maddhiboyina |

ప్రతీ ఏడాది ఎవరెస్టును ఎక్కడానికి 300 మందికి అవకాశం ఇస్తారు. పర్వతారోహకుల రక్షణ, ఎవరెస్టు పరిశుభ్రతకు ఈ పెంచిన ఫీజులు ఉపయోగిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఎవరెస్టు ఎక్కాలంటే రూ.13 లక్షలు కట్టాల్సిందే
X

- పర్వతారోహణ ఫీజును భారీగా పెంచిన నేపాల్

- ఒకే సారి 35 శాతం పెంపు

- పర్యాటకులకు భారమే

దిశ, నేషనల్ బ్యూరో:

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన ఎవరెస్టును అధిరోహించడానికి ప్రతీ ఏటా వందలాది మంది పర్యాటకులు నేపాల్‌కు వస్తుంటారు. అయితే ఇకపై ఎవరెస్టును అధిరోహించాలంటే 15 వేల డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.13 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ ఫీజు 11 వేల డాలర్లుగా ఉండగా.. తాజాగా నేపాల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం 35 శాతం మేర పెంచింది. గత పదేళ్లలో ఫీజులను పెంచలేదని, అందుకే వాటిని తాజాగా సవరించామని టూరిజం శాఖ డైరెక్టర్ జనరల్ నారాయణ్ ప్రసాద్ తెలిపారు. ఈ ఫీజులు 2025 సెప్టెంబర్ నుంచి అమలులోకి వస్తాయని పర్యతారోహకులు ఎక్కువగా వచ్చే ఏప్రిల్-మే సీజన్‌కు ఈ ఫీజులు వర్తిస్తాయని చెప్పారు. ఇక తక్కువ పాపులారిటీ ఉన్న సెప్టెంబర్-నవంబర్ సీజన్‌ ఫీజును కూడా 7,500 డాలర్లు (రూ.6.47 లక్షలు), డిసెంబర్-ఫిబ్రవరి సీజన్ ఫీజును 3,750 డాలర్లు (రూ.3.23 లక్షలు) వరకు పెంచినట్లు చెప్పారు. ఏటా వందలాది పర్వతారోహనకు నేపాల్‌కు వస్తారు. వీరిలో ఎక్కువ మంది ఎవరెస్టును అధిరోహించడానికే ప్రాధాన్యత ఇస్తారు. ప్రతీ ఏడాది ఎవరెస్టును ఎక్కడానికి 300 మందికి అవకాశం ఇస్తారు. పర్వతారోహకుల రక్షణ, ఎవరెస్టు పరిశుభ్రతకు ఈ పెంచిన ఫీజులు ఉపయోగిస్తామని అధికారులు చెబుతున్నారు.

Next Story