- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nepal: నేపాల్‌లో మళ్లీ జెన్ జీ నిరసనలు.. కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం
నేపాల్‌లో మరోసారి జెన్ జీ నిరసనలు వెల్లువెత్తాయి. జెన్ జీ, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి.

దిశ, నేషనల్ బ్యూరో: నేపాల్‌లో మరోసారి జెన్ జీ నిరసనలు వెల్లువెత్తాయి. బారా జిల్లాలో జెన్ జీ, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) (సీపీఎన్ యూఎంఎల్) కార్యక్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. అనంతరం జెన్ జీ యువకులు భారీగా వీధుల్లోకి వచ్చి సీపీఎన్ యూఎంఎల్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు కార్యాలయాల ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను చెదర గొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. హింసాత్మక ఘర్షణల్లో 10 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. అప్రమత్తమైన సుశీలా కర్కీ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కర్వ్యూ విధించింది. భారత సరిహద్దు ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. నిరసనకారులు శాంతి యుతంగా ఉండాలని కర్కీ విజ్ఞప్తి చేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు.
బారా జిల్లాలోని సిమ్రా ప్రాంతంలో జెన్ జీ యువత, సీపీఎన్ యూఎంఎల్ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఇరువురు పోటీ పోటీగా నినాదాలు చేసుకున్నారు. అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా, నేపాల్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో జెన్ జీ తిరుగుబాటు తర్వాత మాజీ ప్రధాని కేపీ ఓలీ తన పదవికి రాజీనామా చేయగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దేశంలో శాంతి యుత పరిస్థితులు ఉండగా మళ్లీ నిరసనలు చెలరేగడం ఇదే తొలిసారి.






