- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nepal Election Results 2026: కొత్త పార్టీ ‘RSP’ ప్రభంజనం.. కేపీ శర్మ ఓలీకి ఎదురుదెబ్బ
నేపాల్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) ప్రభంజనం సృష్టంచే దిశగా పయనిస్తుంది. పాత తరం రాజకీయ నేతలకు జెన్-జీ ఓటర్లు షాకిస్తూ సంచలన తీర్పును ఇవ్వబోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: నేపాల్‌లో ఉత్కంఠభరితంగా సాగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా యువత (Gen Z) చేపట్టిన భారీ నిరసనల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో సాంప్రదాయ రాజకీయ పార్టీలకు కొత్త తరం నేతల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.
ముందంజలో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ..
ప్రముఖ రాపర్ బలేంద్ర షా (Balen Shah) నాయకత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) 36 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాఠ్మాండు మేయర్‌గా ఇప్పటికే గుర్తింపు పొందిన బలేంద్ర షా, ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ తన ముద్ర వేస్తున్నారు. యువత మద్దతుతో ఆయన పార్టీ పలు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని సీపీఎన్-యుఎంఎల్ (CPN-UML) పార్టీకి ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ప్రస్తుతం ఆ పార్టీ 3 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉంది. పాత తరం రాజకీయాలకు, కొత్త తరం ఆకాంక్షలకు మధ్య జరుగుతున్న ఈ పోరులో ఓలీ వర్గానికి ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని ప్రాథమిక ట్రెండ్స్ సూచిస్తున్నాయి.
జెన్-జీ నిరసనల ప్రభావం..
నేపాల్‌లో వ్యవస్థాగత మార్పులు కోరుతూ.. ఇటీవల యువత పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. నిరుద్యోగం, అవినీతి, రాజకీయ అస్థిరతపై ఆగ్రహంతో ఉన్న యువ ఓటర్లు ఈసారి ‘మార్పు’ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే రాపర్ బలేంద్ర షా వంటి వారికి ప్రజలకు కట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఎన్నికల కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం, నేరుగా ఎన్నికయ్యే 165 స్థానాల ఫలితాలు ఇవాళ రాత్రి కల్లా వెలువడే అవకాశం ఉంది. అయితే, మిగిలిన 110 స్థానాల (Proportional Representation) లెక్కింపు పూర్తి కావడానికి మరో రెండు మూడు రోజులు పట్టవచ్చు.






