- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేపాల్ భూకంపం.. ఉత్తర భారతదేశంలో ప్రకంపనలు.. సంచలన విషయాలు వెల్లడించిన నిపుణులు
నేపాల్ లో భూకంపం సంభవించింది.

దిశ, వెబ్ డెస్క్: నేపాల్ (Nepal) లో భూకంపం (Earth Quake) సంభవించింది. దీంతో ఉత్తర భారతదేశం (North India)లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. నేపాల్ సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0 గా నమోదు అయ్యింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center For Sysmology) ప్రకారం భూకంపం భూమికి 20 కిలో మీటర్ల లోతులో ఉన్నది. గత కొద్ది రోజుల క్రితం మయన్మార్ (Mayanmar), థాయ్‌లాండ్ (Thailand) లలో భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే నేపాల్ లో కూడా భూకంపం రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నేపాల్ లో భూకంపాలు సంభవించడానికి గల కారణాలపై వాతావరణ నిపుణులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దక్షిణాసియాలో టెక్టోనిక్ ప్లేట్ల కదలిక పెరిగడం వల్ల భూకంపాలు వస్తున్నాయని వివరించారు. అంతేగాక దీని వల్ల భవిష్యత్తులో మరిన్ని భారీ భూకంపాలు సంభవించే అవకాశం ఉందని, ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.






