భారత్‍కు నేపాల్ ఎయిర్ లైన్స్ క్షమాపణలు.. రీజన్ ఇదే

by Prasad Jukanti |

జమ్మూకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపుతూ పోస్ట్ చేసిన మ్యాప్‌పై వివాదం చెలరేగడంతో నేపాల్ ఎయిర్‌లైన్స్ భారత్‌కు క్షమాపణలు తెలిపింది.

భారత్‍కు నేపాల్ ఎయిర్ లైన్స్ క్షమాపణలు.. రీజన్ ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో: పొరుగు దేశం నేపాల్ ఎయిర్‍లైన్స్ (Nepal Airlines) భారత్‍కు క్షమాపణలు చెప్పింది. జమ్మూకశ్మీర్‍ను పాకిస్థాన్‍లో భాగంగా చూపుతూ తన నెట్‍వర్క్ మ్యాప్‍ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పట్ల విచారం వ్యక్తం చేసింది. ఇటీవల మా సోషల్ మీడియా ఛానెల్‌లలో షేర్ చేసిన నెట్‌వర్క్ మ్యాప్‌లో జరిగిన పొరపాటుకు మేము హృదయపూర్వక క్షమాపణలు (Apology) కోరుతున్నామని ప్రకటించింది. ఆ మ్యాప్‌లో అంతర్జాతీయ సరిహద్దులకు సంబంధించి భౌగోళిక వ్యత్యాసాలు ఉన్నాయని గమనించాం. అవి నేపాల్ దేశం లేదా నేపాల్ ఎయిర్‌లైన్స్ యొక్క అధికారిక వైఖరిని ప్రతిబింబించవని పేర్కొంది.

వెంటనే చర్యలు:

మేము వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించామని భవిష్యత్తులో మా సమాచారం అత్యంత ఖచ్చితత్వంతో ఉండేలా చూసుకోవడానికి అంతర్గత సమీక్షను నిర్వహిస్తున్నామని తెలిపింది. ఈ ప్రాంతంలోని మా పొరుగు దేశాలు మరియు మిత్రదేశాలతో మాకున్న బలమైన సంబంధాలను మేము ఎంతో గౌరవిస్తామమని ఆ పోస్ట్ కారణంగా ఎవరికైనా మనస్తాపం కలిగి ఉంటే అందుకు మేము చింతిస్తున్నట్లు ప్రకటించింది. కాగా జమ్మూకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపించే మ్యాప్‌ను నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌ పోస్టు చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇది వివాదాస్పదం కావడంతో పోస్ట్‌ తొలగించిన సంస్థ ఈ క్రమంలోనే తాజాగా భారత్‌కు క్షమాపణలు చెబుతూ నేడు పోస్ట్‌ చేసింది.

Next Story