నీట్ యూజీ పేపర్ లీక్ కేసు: నిందితుడికి కోర్టు కీలక అనుమతి

by Kema Shiva Kumar |

నీట్ యూజీ పేపర్ లీక్ కేసు నిందితుడు యశ్ యాదవ్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది.

నీట్ యూజీ పేపర్ లీక్ కేసు: నిందితుడికి కోర్టు కీలక అనుమతి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో హాట్ టాపిక్‌గా మారిన నీట్ యూజీ (NEET UG) పేపర్ లీక్ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న యశ్‌ యాదవ్‌ (Yash Yadav)కు న్యాయస్థానం ఉపశమనాన్ని కలిగించింది. ఈ మేరకు జూన్ 21న జరగనున్న నీట్ యూజీ రీ ఎగ్జామ్‌కు హాజరయ్యేందుకు, అలాగే తన సోదరి వివాహ వేడుకలో పాల్గొనేందుకు కోర్టు అనుమతించింది. అయితే, నిందితుడు యశ్ యాదవ్‌ను పూర్తి పోలీసు కస్టడీలోనే పరీక్షా కేంద్రానికి, వివాహ వేడుకకు తీసుకెళ్లాలని కోర్టు స్పష్టం చేసింది.

విద్య అనేది ప్రాథమిక హక్కు..

యశ్ యాదవ్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్టు మానవీయ కోణంలో కీలక వ్యాఖ్యలు చేసింది. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు అని కామెంట్ చేసింది. నిందితుడిగా ఉన్నప్పటికీ నిందితుడి విద్యా అకాశాలను అడ్డుకోలేమని తేల్చి చెప్పింది. అందుకే కస్టడీలోనే కొనసాగిస్తూ యశ్ యాదవ్‌‌కు పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించింది. అదేవిధంగా నిందితుడు పరీక్ష రేసేందుకు, కుటుంబ వేడుకకు హాజరవడానికి వీలుగా అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులను రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Next Story