Neet ug: రేపు దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష.. పేపర్ లీక్ ఆందోళనలతో భద్రత పెంచిన ఎన్టీఏ

by B.Srinivas |   (  Updated:2025-05-03 14:46:05  IST  )

వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ- 2025 పరీక్ష ఆదివారం జరగనుంది.

Neet ug: రేపు దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష.. పేపర్ లీక్ ఆందోళనలతో భద్రత పెంచిన ఎన్టీఏ
X

దిశ, నేషనల్ బ్యూరో: వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (Neet Ug)- 2025 పరీక్ష ఆదివారం జరగనుంది. దేశ వ్యాప్తంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. దేశంలోని 566 నగరాల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తుండగా 5453 సెంటర్లు ఏర్పాటు చేశారు. 22.7 లక్షల విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తెలిపింది. పేపర్ లీక్ ఆందోళనలతో పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను పెంచారు. ఎగ్జామ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల్లో మాక్ డ్రిల్స్ చేపట్టారు. మొబైల్ సిగ్నల్ (Mobile Signal) జామర్‌ల పనితీరు, ఫ్రిస్కింగ్‌కు తగినంత సిబ్బంది లభ్యత, బయోమెట్రిక్ (Biometric) పని తీరును గమనించారు.

రాష్ట్ర, కేంద్ర స్థాయిలో మూడు అంచెల పర్యవేక్షణను ఏర్పాటు చేశారు. అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. అభ్యర్థులకు మూడేళ్ల వరకు మరోసారి ఎన్టీఏ పరీక్షలకు హాజరుకాకుండా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. కాగా, గతేడాది నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలతో దేశ వ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కేంద్రం మరోసారి అలాంటి పొరపాట్లు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నది.

Next Story