- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ పేపర్ లీక్.. మరో నిందితుడికి సీబీఐ కస్టడీ
నీట్ 2026 క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో మరో నిందితుడికి కోర్టు సీబీఐ కస్టడీ విధించింది.

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో అరెస్టైన మరో నిందితుడు ధన్య లోఖండేకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆరురోజులపాటు సీబీఐ కస్టడీ విధించింది. ఈ మేరకు జడ్జి అజయ్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. మనీషా వాఘ్మారే అనే వ్యక్తి పరీక్ష ప్రశ్నాపత్రాన్ని ధన్య లోఖండేకు పంపగా.. దానిని అతను శుభమ్ ఖైరేవార్ కు పంపినట్లుగా ఆరోపణలు ఉన్నట్లు సీబీఐ కోర్టుకు వివరించింది. మనీషా వాఘ్మారేకు సంబంధించి.. ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని సీబీఐ తెలిపింది.
కాగా.. మే 14వ తేదీన ఐదుగురు నిందితులను కోర్టులో ప్రవేశ పెట్టగా.. వారికి ఏడురోజులపాటు సీబీఐ కస్టడీ విధించింది. సీబీఐ కస్టడీకి వెళ్లినవారిలో మహారాష్ట్ర నాసిక్ కు చెందిన శుభమ్ ఖైరేవార్, జైపూర్ కు చెందిన మంగీలాల్ బీవాల్, వికాస్ బీవాల్, దినేష్ బీవాల్ లతో పాటు.. గురుగ్రామ్ కు చెందిన యష్ యాదవ్ కూడా ఉన్నారు. ఇక నాసిక్ నివాసి అయిన శుభమ్ ఖైరేవార్ ను మే 13న ముంబైలో అరెస్ట్ చేసి.. రెండ్రోజుల ట్రాన్సిట్ రిమాండ్ పై ఢిల్లీకి తరలించారు. మే3వ తేదీన దేశవ్యాప్తంగా NEET UG 2026 పరీక్ష జరగ్గా.. దానికంటే ముందే క్వశ్చన్ పేపర్ వాట్సాప్, టెలిగ్రామ్ లలో పీడీఎఫ్ గా లీకైనట్లు సీబీఐ తెలిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) లోని ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్ వరుణ్ భరద్వాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఈ వ్యవహారంపై మే 12న సీబీఐ ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసింది.






