- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. ఇద్దరు మాస్టర్ మైండ్స్‌కు సీబీఐ కస్టడీ
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ కేసు విచారణలో కీలక అడుగు పడింది.

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ కేసు విచారణలో కీలక అడుగు పడింది. లీక్ కు కారణమైన మాస్టర్ మైండ్, పుణెకు చెందిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ పీవీ కులకర్ణిని సీబీఐ అధికారులు నిన్న అరెస్ట్ చేయగా.. నేడు మరో మాస్టర్ మైండ్ మనీషాను కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరినీ నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా.. వారిని సీబీఐ విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఇద్దరినీ 10 రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
నిజాలు రాబట్టేందుకు సీబీఐ వ్యూహం
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వెనుక పెద్ద ఎత్తున అంతర్రాష్ట్ర ముఠా ప్రమేయం ఉందని భావిస్తున్న సీబీఐ.. నిందితులను లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపింది. పేపర్ ఎక్కడ లీక్ అయింది? ఎవరెవరికి చేరింది? ఇందులో పెద్ద తలకాయలు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో నిజాలు రాబట్టేందుకు 14 రోజుల కస్టడీ కావాలని సీబీఐ తరఫు న్యాయవాదులు గట్టిగా వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు.. నిందితులిద్దరికీ 10 రోజుల సీబీఐ కస్టడీని మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న ఈ స్కామ్‌లో నిందితుల నుంచి కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను సేకరించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది.






