- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BIG BREAKING: నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో సంచలనం.. మాస్టర్ మైండ్ అరెస్ట్
నీట్ -యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాస్టర్ మైండ్ ప్రొఫెసర్ పీవీ కులకర్ణిని సీబీఐ అరెస్ట్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: నీట్ -యూజీ 2026 ప్రశ్నాపతం లీక్ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును మార్చేసింది. ఈ ఒక్కలీక్ తో మరోసారి వారంతా పరీక్ష రాయాల్సిన పరిస్థితి తలెత్తింది. నీట్ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయడం వెనుక ఉన్న మాస్టర్ మైండ్.. లాతూర్ కు చెందిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ పీ.వీ.కులకర్ణిని సీబీఐ అధికారులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో కలిసి.. కులకర్ణికి కూడా పరీక్షల నిర్వహణ ప్రక్రియలో పాల్గొన్నాడని, అందుకే నీట్ ప్రశ్నాపత్రాలకు యాక్సెస్ లభించిందని తెలిపారు.
మే3వ తేదీన పరీక్ష జరగ్గా.. ఏప్రిల్ చివరి వారంలోనే కులకర్ణి ప్రశ్నాపత్రం లీక్ కు తన వ్యూహాన్ని అమలు చేశాడని పేర్కొన్నారు. మరో నిందితురాలైన మనీషా వాఘ్మారే సహాయంతో విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ క్లాసులు నిర్వహించాడని, ఆ సమయంలోనే ప్రశ్నాపత్రంలో ఉన్న క్వశ్చన్లు, వాటి ఆప్షన్లు, వాటికి సరైన సమాధానాలను చెప్పాడని వివరించారు. ఆయన చెప్పిన ఆన్సర్లన్నింటినీ విద్యార్థులు తమ బుక్కుల్లో రాసుకున్నారని, అవన్నీ నీట్ క్వశ్చన్ పేపర్ తో పోలిస్తే.. అంతా ఒకలాగే ఉందని తెలిపారు. కులకర్ణిని మరింత విచారించాల్సిన అవసరం ఉందని, కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తీసుకుంటామని సీబీఐ అధికారులు తెలిపారు.






