- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NEET 2025: నేడే నీట్.. దేశవ్యాప్తంగా 5,453 కేంద్రాల్లో పరీక్ష
దేశవ్యాప్తంగా నేడు నీట్ పరీక్ష జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా నేడు నీట్ పరీక్ష జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. పరీక్ష నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నీట్ పరీక్ష నిర్వహణ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా 566 నగరాల్లో 5,453 కేంద్రాలను ఏర్పాటు చేసింది. దాదాపు 22.7 లక్షలమంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. కాగా.. పేపర్ లీక్ ఆందోళనల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను పెంచారు. పరీక్షను సజావుగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల్లో శనివారం మాక్ డ్రిల్స్ చేపట్టారు. మొబైల్ సిగ్నల్ జామర్ల పనితీరు, ఫ్రిస్కింగ్ కు తగినంత సిబ్బంది లభ్యత, బయోమెట్రిక్ పనితీరును గమనించారు. గతేడాది నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలతో దేశవ్యాప్తంగా దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా NTA పటిష్ఠ బందోబస్త్ చర్యలు తీసుకుంటోంది.
నీట్ పరీక్షపై పుకార్లు, తప్పుదోవ పట్టించే సమాచారం ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ హెచ్చరించింది. ఇప్పటికే 165 టెలిగ్రామ్ ఛానెళ్లతోపాటు 32 ఇన్స్ట్రాగ్రామ్ అకౌంట్లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించింది. తప్పుడు వాగ్ధానాలతో మోసం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించింది.
ఈ వస్తువుల్ని తీసుకెళ్లొద్దు
నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు NTA కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. పరీక్షాకేంద్రాల్లోకి ఏయే వస్తువులు తీసుకువెళ్లకూడదో సూచించింది. టెక్స్ట్ మెటీరియల్స్, పెనిల్ బాక్స్, ప్లాస్టిక్ పౌచ్లు, కాలిక్యులేటర్, స్కేల్, పెన్,రైటింగ్ ప్యాడ్, పెన్ డ్రైవ్స్, ఎరేజర్, లాగ్ టేబుల్, ఎలక్టరానిక్ పెన్, స్కానర్, మొబైల్స్, బ్లూటూత్, ఇయర్ ఫోన్స్, మైక్రోఫోన్, పేజర్, హెల్త్ బ్యాండ్ వంటి వాటిని పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లకూడదు. వాటితోపాటు వాలెట్, సన్ గ్లాసెస్, హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్, క్యాప్,రిస్ట్ వాచ్, స్మార్ట్ వాచ్, కెమెరా, ఆభరణాలు, లోహ వస్తువులు కూడా పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లరాదని NTA సూచించింది.






