- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ రూల్స్ ఇంత దారుణమా? విద్యార్థిని డ్రెస్ బటన్స్ కత్తిరించి!
నీట్ పరీక్షల నిర్వహణ విధానం తరచూ వివాదాస్పదంగా మారుతూ ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్: నీట్ పరీక్షల నిర్వహణ విధానం తరచూ వివాదాస్పదంగా మారుతూ ఉంటుంది. గతంలో విద్యార్థుల లో దుస్తులు తీసి మరీ పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడులో విద్యార్థినుల డ్రెస్ బటన్స్ తొలగించడం వివాదాస్పదంగా మారింది. పరీక్షకు హాజరైన ఓ విద్యార్థిని డ్రెస్‌కు మెటల్ బటన్స్ ఉన్నాయనే కారణంతో మహిళా పోలీస్ సిబ్బంది వాటిని కత్తిరించి తొలగించారు.
అనంతరం ఆ విద్యార్థినిని పరీక్ష కేంద్రం నుండి తీసుకువెళ్లి వేరే బటన్స్ కుట్టించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తమిళనాడు పోలీసులే ఓవర్ చేస్తున్నారని దేశంలో ఎక్కడా ఇలా వ్యవహరించడం లేదని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. నీట్ పరీక్షకు ఇంత దారుణంగా చెకింగ్ చేయడం అవసరమా.. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు ఇలాంటి రూల్స్ ఏ పెట్టాలి అంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






