- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ పేపర్ లీక్ దుమారం.. పార్లమెంటరీ కమిటీ ముందుకు NTA చీఫ్
NEET (UG) పేపర్ లీకేజీ ఉదంతం, పరీక్షల సంస్కరణలపై సమీక్షించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చీఫ్ అభిషేక్ సింగ్‌కు పార్లమెంటరీ ప్యానెల్ నోటీసులు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో దుమారం రేపిన నీట్-యూజీ (NEET-UG) పరీక్షల పేపర్ లీకేజీ ఉదంతంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (Parliamentary Standing Committee) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ పరీక్షల సంస్థ (NTA) పనితీరు, పరీక్షల నిర్వహణలో తీసుకుంటున్న చర్యలపై సమీక్షించేందుకు గానూ NTA చీఫ్ అభిషేక్ సింగ్‌కు పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. మే 21న కమిటీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ సందర్భంగా నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలు, పేపర్ లీకేజీ ఆరోపణలు, అలాగే ఫలితాల వెల్లడిలో దొర్లిన అవకతవకలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా పరీక్షల వ్యవస్థలో తీసుకురావాల్సిన సమూల మార్పులు, సంస్కరణలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.
అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.. ఎన్‌టీఏ చీఫ్‌తో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులను కూడా ఈ సమీక్షా సమావేశానికి పిలిపించింది. పేపర్ లీకేజీల నివారణకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు.. భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి? పరీక్షల పారదర్శకతను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలపై కమిటీ తెలుసుకోనున్నట్లు సమాచారం.






