NEET paper leak: నీట్ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

by Shamantha N |

దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌- యూజీ ప్రవేశపరీక్ష 2024 (NEET UG-2024)’లో పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు సంజీవ్ ముఖియా అరెస్టయ్యాడు.

NEET paper leak: నీట్ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌- యూజీ ప్రవేశపరీక్ష 2024 (NEET UG-2024)’లో పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు సంజీవ్ ముఖియా అరెస్టయ్యాడు. గురువారం రాత్రి ఆర్థిక నేర విభాగం (EOU) బృందం అతడ్ని అరెస్టు చేసింది. పాట్నాలో అతడ్ని అరెస్టు చేసినట్లు ఈవోయూ అధికారి నయ్యర్‌ హుస్సేన్‌ ఖాన్‌ వెల్లడించారు. కాగా.. నీట్‌ పేపర్‌ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా సంజీవ్‌ ముఖియా పేరు వినిపించింది. ఆ తర్వాత అతడు పరారయినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల బిహార్‌ (Bihar) ప్రభుత్వం సంజీవ్‌ ఆచూకీ కనిపెట్టిన వారికి రూ.3లక్షల రివార్డు ప్రకటించింది. ఈక్రమంలోనే అతడు పాట్నాలోని ఒక అపార్టుమెంట్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో అధికారులు అతడ్ని అరెస్టు చేశారు. ఈ అరెస్టుతో పేపర్‌ లీక్‌కు కారుకులైన మరికొందరి వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

నీట్ పేపర్ లీక్

నీట్‌ పేపర్ లీక్‌ వ్యవహారంపై మధ్యవర్తులు, విద్యార్థులు సహా 14 మందిని బిహార్‌ పోలీసులు అరెస్టు చేసి విచారించగా.. సంజీవ్‌ ముఖియా పేరు బయటకొచ్చింది. కాగా.. ఈ కేసులో సంజీవ్‌ కుమారుడు శివ్‌కుమార్‌ ప్రమేయం ఉన్నట్లు తేలింది. బిహార్‌ టీచర్ రిక్రూట్ మెంట్ టెస్టు పేపర్ లీకేజీ కేసులో అరెస్టయి జైళ్లో ఉన్నాడు. వీరిద్దరూ ‘ముఖియా సాల్వర్‌ గ్యాంగ్‌’ పేరుతో ఓ ముఠాను ఏర్పాటుచేసినట్లు తెలిసింది. ఇకపోతే, బిహార్‌లోని నలందా జిల్లా నాగర్‌సోనా ప్రాంతానికి చెందిన సంజీవ్‌ (Sanjeev Mukhiya) తొలుత సాబూర్‌ అగ్రికల్చర్‌ కాలేజీలో పని చేశాడు. అక్కడ పేపర్‌ లీక్‌ చేసినట్లు ఆరోపణలు రావడంతో 2016లో అతడిపై వేటు వేశారు. ఆ కేసులో కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఆతర్వాత నలంద కాలేజీ నూర్‌సరయ్‌ బ్రాంచ్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా చేరాడు.

Next Story