- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NEET రీ ఎగ్జామ్ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటన.. వచ్చే ఏడాది నుంచి కీలక మార్పు
నీట్ రీ ఎగ్జామ్ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. విద్యార్థులకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్ ప్రశ్నపత్రం ఎలా లీక్ అయిందనే విషయం త్వరలో బహిర్గతం అవుతుందని ఈ విషయంలో సీబీఐ అన్ని వివరాలు రాబడుతోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా నీట్ యూజీ -2026 పరీక్ష రద్దు నేపథ్యంలో రీ ఎగ్జామ్‍పై ఇవాళ ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. విద్యార్థులు ఎవరూ నష్టపోకూడదనే పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తున్నామన్నారు. నీట్ కోసం విద్యార్థులు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. పరీక్ష రాసే సమయం మరో పావుగంట పెంచుతున్నామని తెలిపారు. అభ్యర్థులు తమకు నచ్చిన నగరంలో పరీక్ష రాయొచ్చనని తెలిపారు. రీ ఎగ్జామ్ తేదీ ఖరారైందని జూన్ 21న ఎగ్జామ్ నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు జూన్ 14 న విడుదల చేస్తామని తెలిపారు.
వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ బేస్ ఎగ్జామ్:
పేపర్ లీకేజీ సామాజిక రుగ్మత అని ఇందులో రాజకీయాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. పేపర్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించబోమన్నారు. ఏటా కోటి మందికి ఎన్టీఏ పరీక్షలు నిర్వహిస్తోందని, వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ బేస్ నీట్ పరీక్ష నిర్వహించబోతున్నామని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తే మా మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు చూసి భయపడొద్దన్నారు. ఈ సారి ఎలాంటి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూస్తామన్నారు.






