- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NEET-2026: నేడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. అభ్యర్థులకు NTA గైడ్‌లైన్స్ ఇవే!
ఇవాళ దేశవ్యాప్తంగా NEET-2026 పరీక్ష జరగనుంది. ఈ మేరకు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పాటించాల్సిన డ్రెస్ కోడ్, రిపోర్టింగ్ సమయాలు, పరీక్షా కేంద్రం నిబంధనలను NTA విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) 2026 ఇవాళ జరగనుంది. ఈ పరీక్షకు హాజరయ్యే లక్షలాది మంది విద్యార్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 వరకు పరీక్షను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.30 కల్లా పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత వచ్చే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ లోరనికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అడ్మిట్ కార్డ్‌లో సూచించిన రిపోర్టింగ్ సమయానికే కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం.
వెంట తప్పనిసరిగా తీసుకెళ్లాల్సినవి..
అభ్యర్థుల పరీక్షా కేంద్రానికి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్ (Hall Ticket)పై పాస్‌పోర్ట్ సైజు ఫోటో అతికించి ఉండాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ వంటి ఒరిజినల్ ఐడీ వెంట ఉండాలి. అటెండెన్స్ షీట్ కోసం అదనంగా ఓ పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో పాటు అడ్మిట్ కార్డ్‌లోని పేజీలో 4X6 సైజ్‌లో కలర్ ఫోటో అతికించాలి. ఒంటిపై లేత రంగు దుస్తులు, హాఫ్ హ్యాండ్స్ ఉన్నవి మాత్రమే ధరించాలి. పెద్ద పెద్ద బటన్లు, జిప్పులు ఉన్న దుస్తులకు అనుమతి లేదు. షూస్ (Shoes) వేసుకోకూడదు. తక్కువ ఎత్తు ఉన్న స్లిప్పర్లు, శాండల్స్ మాత్రమే అనుమతించబడతాయి. ఇక పరీక్షా కేంద్రంలోనికి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ డివైజ్‌లు, వాలెట్లు, ఆభరణాలు, ఎలాంటి స్టేషనరీ అనుమతించరు. పెన్నులను పరీక్షా కేంద్రంలోనే ఎన్టీఏ అందిస్తుంది. అదేవిధంగా విద్యార్థులు తమ అడ్మిట్ కార్డ్‌లోని అన్ని పేజీలను క్షుణ్ణంగా చదవాలి. ఇక పరీక్ష ముగిసే వరకు విద్యార్థులు బయటకు వచ్చేందుకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు.






