- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NEET-2026: అసలు పేపర్‌ను పోలి ఉన్న ‘గెస్ పేపర్’.. రాజస్థాన్‌లో లీక్‌పై అనుమానాలు!
నీట్ 2026 పరీక్షా పత్రం లీక్ అయిందనే వార్తలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ (NEET) 2026 మెడికల్ ఎంట్రన్స్ పరీక్షపై భారీ వివాదం రాజకుంది. రాజస్థాన్ (Rajasthan)లో పరీక్షకు ముందు బయటపడిన ఒక ‘గెస్ పేపర్’ అసలు పరీక్షలో వచ్చిన ప్రశ్నలతో దాదాపు 100 శాతం సరిపోలడం కలకలం సృష్టిస్తోంది. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన అంచనా కాదని, పరీక్షా పత్రం ముందే లీక్ అయిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
అచ్చుగుద్దినట్లు ఉన్న ప్రశ్నలు..
రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పరీక్షకు ముందే సోషల్ మీడియా (Social Media)లో ఓ గెస్ పేపర్ హల్‌చల్ చేసింది. అయితే, పరీక్ష ముగిసిన తర్వాత ఆ పేపర్‌ను అసలు ప్రశ్నాపత్రంతో పోల్చి చూసిన విద్యార్థులు, నిపుణులు షాక్‌కు గురయ్యారు. ప్రశ్నల సరళి, ఆప్షన్లు, వరుస క్రమం కూడా అచ్చుగుద్దినట్లు ఉండటంతో పేపర్ లీక్ అయిందనే అనుమానాలు బలపడ్డాయి. ఈ మొత్తం వ్యవహారంపై రాజస్థాన్ ప్రభుత్వం, పోలీసులు తక్షణమే స్పందించారు. మే 3న జరిగిన నీట్ పరీక్షలో వచ్చిన 720 మార్కులకు గాను, సుమారు 600 మార్కుల వరకు ప్రశ్నలు ఈ గెస్ పేపర్‌లో ఉన్నవేనని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి చెందిన 300కు పైగా ప్రశ్నలు ఒకే చేతిరాతతో రాసి ఉన్న పత్రాన్ని పోలీసులు గుర్తించారు. ఇందులో 140 ప్రశ్నలు నేరుగా పరీక్షలో వచ్చినవే. ఈ ‘గెస్ పేపర్’ మూలాలను వెతికేందుకు గాను ప్రత్యేక దర్యాప్తు బృందాలను (SIT) ఏర్పాటు చేశారు. కోచింగ్ సెంటర్లు, పరీక్షా నిర్వహణ సిబ్బంది మధ్య ఏవైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా..? ప్రశ్నాపత్రం ఏ స్థాయిలో బయటకు వచ్చింది? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
రూ.వేల నుంచి లక్షల వరకు విక్రయం..
ఈ లీకైన సమాచారం సీకర్‌లో పరీక్షకు రెండు రోజుల ముందే బయటకు వచ్చింది. తొలుత ఒక్కో కాపీని రూ.20 వేల నుంచి రూ. 2 లక్షల వరకు విక్రయించగా, పరీక్షకు ముందు రోజు రాత్రికి వీటి ధర రూ.30 వేలకు పడిపోయిందని సమాచారం. వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఇది వేలమంది విద్యార్థులకు చేరినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన నిందితుడు ఝార్ఖండ్‌కు చెందిన ఓ ఎంబీబీఎస్ (MBBS) విద్యార్థి అని దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం కేరళలోని ఒక మెడికల్ కాలేజీలో చదువుతున్న ఇతను, మే 1న తన స్నేహితుడికి ఈ సమాచారాన్ని చేరవేశాడు. అక్కడి నుంచి పీజీ హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు, కెరీర్ కౌన్సెలర్ల ద్వారా దావానంలా వ్యాపించింది.
నివేదిక కోసం ఎదురుచూస్తున్న ఎన్టీఏ (NTA)
గత 2024 నీట్ వివాదాలు మరువక ముందే మళ్లీ ఇలాంటి ఘటన జరగడం విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. రాజస్థాన్ ఎస్ఓజీ (SOG) ఇచ్చే తుది నివేదిక ఆధారంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తదుపరి నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ లీక్ నిర్ధారణ అయితే, ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. నీట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలో ఇలాంటి ఘటనలు జరగడంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. కష్టపడి చదివిన విద్యార్థులు ఈ వార్తలతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఒకవేళ లీక్ నిర్ధారణ అయితే, పరీక్షను రద్దు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.






