- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్‌గా పదోన్నతి
నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్‌గా పదోన్నతి లభించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ హోదా అందించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాను గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాతో భారత ప్రభుత్వం సత్కరించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఓఏఎస్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆధ్వర్యంలో బుధవారం నాడు భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాను నీరజ్ స్వీకరించారు. ఏప్రిల్ 16వ తేదీన ఈ అపాయింట్‌మెంట్ జరిగినట్లు గెజిట్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2016 ఆగస్టు 26న నైబ్ సుబేదార్ ర్యాంక్‌లో భారత ఆర్మీలో నీరజ్ చోప్రా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన నీరజ్.. 2017లో అర్జున అవార్డు, 2021లో ఖేల్ రత్న వంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తర్వాత 2021లో ఆయనకు సుబేదార్‌గా భారత ఆర్మీలో పదోన్నతి లభించింది. 2022లో పరమ విశిష్ట సేవా మెడల్‌తో నీరజ్‌ను భారత ఆర్మీ సత్కరించింది. అదే క్రమంలో 2022లోనే సుబేదార్ మేజర్ స్థాయికి ఆయన్ను ప్రమోట్ చేసింది. అదే ఏడాది పద్మ శ్రీ అవార్డు కూడా అందుకున్నాడీ జావెలిన్ వీరుడు.






